ఇలా హ్యాక్.. అలా మెక్‌డోనాల్డ్స్ నుంచి ఉచిత బర్గర్లు! (వీడియో)

By rajesh yFirst Published Apr 9, 2019, 3:22 PM IST
Highlights

మీరు మెక్‌డోనాల్డ్స్‌ వెళ్లి ఉచితంగా బర్గర్లను పొందవచ్చు. ఎలాగంటే.. ఇటీవల మెక్‌డోనాల్డ్స్‌కి వెళ్లిన కొందరు యువకులు ఉచితంగానే బర్గర్లను పొందారు. మెక్‌డొనల్డ్స్‌కు చెందిన సెల్ఫ్ సర్వీస్ మెషిన్‌ను హ్యాక్ చేయడంతో అది వారికి సాధ్యమైంది. 


మీరు మెక్‌డోనాల్డ్స్‌ వెళ్లి ఉచితంగా బర్గర్లను పొందవచ్చు. ఎలాగంటే.. ఇటీవల మెక్‌డోనాల్డ్స్‌కి వెళ్లిన కొందరు యువకులు ఉచితంగానే బర్గర్లను పొందారు. మెక్‌డొనల్డ్స్‌కు చెందిన సెల్ఫ్ సర్వీస్ మెషిన్‌ను హ్యాక్ చేయడంతో అది వారికి సాధ్యమైంది. 

తాము బర్గర్లను ఉచితంగా పొందామని.. మీరు కూడా ఇలా చేయొచ్చంటూ వారు హ్యాక్ చేసిన విధానాన్ని వివరిస్తూ వీడియో కూడా తీశారు. ఈ 2 నిమిషాల వ్యవధి గల వీడియోలో పైసా లేకుండా బర్గర్ పొందడం ఎలానో చెప్పేశారు. ఆస్ట్రేలియాలోని మెక్‌డోనాల్డ్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

కొందరు స్నేహితులైన యువకులు పది బర్గర్లను ఆర్డర్ చేశారు. సాధారణంగా 1 బర్గర్‌కు  ఒక డాలర్ కాగా.. వీరు ఆర్డర్ చేసిన 10బర్గర్లకు కేవలం 1డాలర్ మాత్రమే బిల్లు పడింది. ఆ తర్వాత ఈ యువకులు దాన్ని కూడా ‘0’గా మార్చేశారు. వారు చేసిన పనికి మెషిన్ కూడా మీరు చెల్లించాల్సిందేమీ లేదంటూ చెప్పేసింది.

                           

అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరువారు చేసిన పనిని ప్రశంసిస్తూ వ్యాఖ్యలు చేయగా.. మరికొందరు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా చేయడం వల్ల అనవసరంగా ఆర్డర్ చేసిన ఫుడ్ వృథా అవుతుందని మండిపడుతున్నారు. ఇది కూడా ఒక రకమైన మోసమేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు. 

కాగా, ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. 1.5 మిలియన్ వ్యూస్ రాగా, 400మందికిపైగా కామెంట్లు చేశారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోపై మెక్‌డోనాల్డ్స్ సంస్థ మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు.

 

click me!