టెక్కీలకు ఫుల్‌జోష్: క్యాంపస్ సెలక్షన్లలో 28 వేల హైరింగ్స్.. ఇదీ టీసీఎస్ టార్గెట్

By Arun Kumar PFirst Published Oct 13, 2018, 12:23 PM IST
Highlights

టెక్కీలకు ఫుల్‌జోష్: క్యాంపస్ సెలక్షన్లలో 28 వేల హైరింగ్స్.. ఇదీ టీసీఎస్ టార్గెట్

బెంగళూరు: వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో సాఫ్ట్‌వేర్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఈ ఏడాది పండుగ కానున్నది. ప్రముఖ ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఈ ఏడాది క్యాంపస్ సెలెక్షన్లలో 28 వేల మందిని నియమించాలని నిర్ణయానికి వచ్చింది. గత మూడు సంవత్సరాల్లో ఇదే అత్యధికం అని ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్నారు. 

గత రెండు సంవత్సరాల్లో ఇంజినీరింగ్ కాలేజీల్లో 20 వేల మంది చొప్పున టీసీఎస్ క్యాంపస్ సెలక్షన్ల ద్వారా నియమించుకున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు తొలి అర్థభాగంలో 16 వేల మందిని టీసీఎస్ నియమించుకున్నదని సంస్థ గ్లోబల్ హ్యూమన్ రీసోర్సెస్ విభాగం అధిపతి, ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు అజయ్ ముఖర్జీ చెప్పారు. 

సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికం నాటికి టీసీఎస్ కుటుంబంలో అదనంగా 10,227 మంది కొత్తగా వచ్చి చేరారు. ఇది గత 12 త్రైమాసికాలతో పోలిస్తే అత్యధికం. బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్స్యూరెన్స్, రిటైల్ రంగాల్లో సేవల కోసం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో భారీగా కొత్త నియామకాలు చేపట్టాలని టీసీఎస్ నిర్ణయానికి వచ్చింది. 

సంస్థ బిజినెస్ యూనిట్లు, పెర్పార్మెన్స్ కు అనుగుణంగా వ్యక్తిగత వేతనాల చెల్లింపులు జరుగుతాయని అజయ్ ముఖర్జీ తెలిపారు. గత నాలుగు త్రైమాసికాల్లో 100 శాతం, అంతకంటే ఎక్కువ వేతనాలు చెల్లిస్తున్న సంస్థగా టీసీఎస్ నిలిచింది. రెగ్యులర్ ఎంట్రీ లెవల్ నియామకాలకు ప్రత్యామ్నాయంగా కొత్త ఉద్యోగ నియామకాలు చేస్తున్నారా? అన్న విషయమై ఇప్పటికిప్పుడు తానేమీ చెప్పలేమని, ఇది తొందరపాటవుతుందని అజయ్ ముఖర్జీ పేర్కొన్నారు.

click me!