ఐటీకి సవాల్: రెండేళ్లలో 2.3 లక్షల ఐటీ ప్రొఫెషనల్స్ కావాలి.. నాస్కామ్

By rajesh yFirst Published Feb 16, 2019, 1:33 PM IST
Highlights

20వ దశకం చివరి దశలో అంతర్జాతీయంగా సమూల మార్పులకు నాంది ప్రస్తావన పలికిన సాంకేతిక రంగ విప్లవానికే ఇప్పుడు పెను సవాల్ ఎదురు కాబోతున్నది. మానవ మేథస్సుకు అద్దం పట్టేలా రోజురోజుకు పెరుగుతున్న నూతన టెక్నాలజీ.. నిపుణుల కొరతకు దారి తీస్తోంది. ప్రత్యేకించి ఆటోమేషన్, డేటా అనలిటిక్స్, క్రుత్రిమ మేధస్సు, బ్లాక్ చైన్ టెక్నాలజీ తదితర రంగాల్లో గతేడాది 1.4 లక్షల మంది నిపుణుల కొరత ఏర్పడగా, 2021 నాటికి 2.3 లక్షలకు చేరుతుందని నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో 50 శాతం మందికి నూతన టెక్నాలజీలపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని నొక్కి చెప్పింది.

బెంగుళూరు: ఐటీ రంగంలో కృతిమ మేథ, డేటా అనలటిక్స్‌ వంటి సాంకేతికత టెక్నాలజీతో పట్టు గల నిపుణులు డిమాండ్‌కు సరిపడా లేరని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్‌) తెలిపింది. 

భారతలో ప్రస్తుతం పని చేస్తున్న ఐటీ ఉద్యోగులలో 50 శాతం మందికి తక్షణమే తాజాగా వెలుగులోకి వచ్చిన టెక్నాలజీ అంశాలపై కొత్త నైపుణ్యాలను నేర్పించాల్సిన అవసరం ఉన్నదని నాస్కామ్‌ ఐటీ-ఐటీఈఎస్‌ స్కిల్ కౌన్సిల్ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అమిత్‌‌ అగర్వాల్ అన్నారు. 

గతేడాదిలో ఐదు లక్షల మంది ఉద్యోగాలు అవసరం కాగా, 1.40 లక్షలమంది నిపుణలైన ఉద్యోగుల కొరత ఏర్పడిందని  నాస్కామ్‌ ఐటీ-ఐటీఈఎస్‌ స్కిల్ కౌన్సిల్ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అమిత్‌‌ అగర్వాల్ పేర్కొన్నారు. కృతిమ మేథస్సు, బిగ్‌డేటా సాంకేతికత రంగాల్లో పని చేసేందుకు 2021 నాటికి 7.80 లక్షల మంది నిపుణులు అవసరం. 

వచ్చే రెండేళ్లలో దాదాపు 2.30 లక్షల నిపుణుల కొరత ఏర్పడబోతుందని  నాస్కామ్‌ ఐటీ-ఐటీఈఎస్‌ స్కిల్ కౌన్సిల్ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అమిత్‌‌ అగర్వాల్  పేర్కొన్నారు. కేవలం కొత్త నైపుణ్యాలను నేర్పించటమే కాక వీటిని కళాశాల బోధనాంశాలలో చేర్చి విద్యార్థులకు నేర్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. 

కొత్త టెక్నాలజీల వాడకంతోపాటు ఆటోమేషన్ పెరగటం వంటివి 167 బిలియన్ అమెరికన్‌ డాలర్ల భారత ఐటీ, సర్వీసుల రంగాన్ని సవాల్‌ చేస్తున్నాయని  నాస్కామ్‌ ఐటీ-ఐటీఈఎస్‌ స్కిల్ కౌన్సిల్ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అమిత్‌‌ అగర్వాల్ తెలిపారు. 

ఉద్యోగుల నైపుణ్యాలను పెంచేందుకు, భవిష్యత్తు టెక్నాలజీలపై పనిచేసేందుకు అవసరమైన మానవ వనరులు అభివృద్ధి కోసం ఐటీ రంగం సంవత్సరానికి రూ.10,000 కోట్లను వెచ్చిస్తోందని నాస్కామ్ తెలిపింది.

2022 నాటికి  క్రుత్రిమ మేథస్సు, బిగ్ డెటా అనలటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాలు ఐటీ రంగంలో డామినేట్ పాత్ర పోషిస్తాయి. గీక్స్‌లో జాబ్స్ ప్రొఫైల్స్ మారిపోతున్నాయని నాస్కామ్ నివేదిక పేర్కొంది. 

క్రుత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డెటా అనలిటిక్స్, ఆటోమేషన్, రొబోటిక్స్, బ్యాక్ చైన్, క్లౌడ్, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ తదితర పది విభాగాల్లో ఐటీ సంస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. 10 రకాల టెక్నాలజీ విభాగాల్లో 70 జాబ్ రోల్స్ గుర్తించామని, వాటిలో 150 రకాల స్కిల్స్ అవసరమని నాస్కామ్‌ ఐటీ-ఐటీఈఎస్‌ స్కిల్ కౌన్సిల్ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అమిత్‌‌ అగర్వాల్ తేల్చారు. 

click me!