జియోమనీ యాప్ కస్టమర్ల ఆధార్ నెంబర్స్ లీక్ చేస్తోందా..?

First Published Jul 5, 2018, 12:33 PM IST
Highlights

ఈ అప్లికేషన్‌లో సెక్యూరిటీ లోపం వలన కస్టమర్ల వివరాలు బయటకు పొక్కే ఆస్కారం ఉన్నట్లు తేలింది.

మీరు జియోమనీ అప్లికేషన్ ఉపయోగిస్తున్నారా? అయితే, మీ ఆధార్ నెంబర్ వివరాలు చిక్కుల్లో పడ్డట్లే. రిలయన్స్ జియో సంస్థ నుండి విడుదలైన జియోమనీ అప్లికేషన్‌లో ఓ చిన్నపాటి సెక్యూరిటీ లోపాన్ని గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండిపెండెంట్ సెక్యూరిటీ రీసెర్చర్ అక్షయ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ అప్లికేషన్‌లో సెక్యూరిటీ లోపం వలన కస్టమర్ల వివరాలు బయటకు పొక్కే ఆస్కారం ఉన్నట్లు తేలింది.

ఈ సెక్యూరిటీ లోపలం వలన కస్టమర్లకు సంబంధించిన ఆధార్ కార్డు నంబర్లు, వారి పుట్టిన తేదీ, వారు మొదటిసారిగా వారు సిమ్ కార్డును వెరిఫై చేసుకున్నారు, వారి జియోమనీ ఖాతాకు సంబంధించిన ఎంపిమ్ (పాస్‌వర్డ్) తదితర వివరాలు లీక్ అయ్యే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. జియోమనీ సర్వీస్‌కి సంబంధించి అక్షయ్‌కు తలెత్తిన సమస్యను పరిష్కరించుకునేందుకు జియో కస్టమర్ కేర్‌ను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో ఆ అప్లికేషన్ సంబంధించిన కోడ్‌ని అతను పరిశీలించి ఈ లోపాన్ని గుర్తుపట్టారు. ఈ వివరాలను అక్షయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వివరించారు.

కాగా.. ఈ ఆరోపణలకు సంబంధించి రిలయన్స్ జియోని మీడియా ప్రతినిధులు వివరణ కోరగా.. కంపెనీ వీటిని ఖండించింది. దీనిపై రిలయన్స్ జియో స్పందిస్తూ.. 'జియోమనీ కస్టమర్ల వివరాలు లీక్ అవుతున్నట్లు మాకు సమాచారం అందింది, అయితే ఇది పూర్తిగా నిరాధారమైనది. కేవలం మా సేవల విషయంలో దుష్ప్రచారం చేయడానికి ఉద్దేశించబడినవి మాత్రమే. మా కస్టమర్ల డేటా పూర్తిగా సురక్షితంగా ఉంది, పూర్తిస్థాయి సెక్యూరిటీ ప్రమాణాలు పాటిస్తున్నామ'ని పేర్కొంది.
 

click me!