అమెజాన్‌లో వన్ ప్లస్ 6టీ ఫోన్ కొంటే చాలు.. 600 గిప్ట్స్

By rajesh yFirst Published Nov 30, 2018, 3:00 PM IST
Highlights

వినియోగదారులను ఆకర్షించేందుకు స్మార్ట్ ఫోన్ సంస్థలు పలు రకాల ఆఫర్లను ముందుకు తెస్తున్నాయి. తాజాగా చైనా స్మార్ట్ ఫోన్ మేజర్ ‘వన్ ప్లస్’ తన 6టీ మోడల్ స్మార్ట్ ఫోన్‌ను ఈ- కామర్స్ అమెజాన్ సంస్థలో కొనుగోలు చేసిన వారిలో లక్కీ విన్నర్ కు 600 బహుమతులను అందుబాటులోకి తెచ్చింది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుతో కొన్న వారికి రూ.1500 క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది.

ముంబై: వన్‌ ప్లస్‌ 6టీ కొనుగోలు చేసిన వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌. చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ వన్‌ప్లస్‌, ఈ-కామర్స్‌ దిగ్గజం ‘అమెజాన్‌’ తమ వ్యాపార భాగస్వామ్య నాలుగో వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు భారీ ఆఫర్‌ ప్రకటించాయి. ‘లక్కీ స్టార్‌’ గా ఎంపికైన వన్‌ప్లస్‌ 6 టీ కొనుగోలుదారుడికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 600 బహుమతులను ఆఫర్‌ చేస్తోంది.

ఈ ఏడాది నవంబర్ 30 (శనివారం) నుంచి వచ్చే డిసెంబర్ రెండో తేదీ మధ్య అమెజాన్ ఇండియా ద్వారా ‘వన్‌ప్లస్‌ 6టీ స్మార్ట్‌ఫోన్‌’ను కొనుగోలు చేసే వినియోగదారులు 'లక్కీ స్టార్'గా ఎంపిక కావడానికి అర్హులు. 

ఈ 600 బహుమతుల్లో హోం అప్లయెన్సెస్‌, ఫ్యాషన్, గృహాలంకరణ వస్తువులు అద్భుతమైన బహుమతులుగా పొందే అవకాశం ఉందని అమెజాన్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ మనీష్‌ తివారీ వెల్లడించారు. బహుమతిగా అందించే ఈ 600 వస్తువుల విలువ ఎంత వుంటుంది అనే స్పష్టత లేదు. ఇక దీనికి హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ డెబిట్ కార్డుతో కొనుగోళ్లు జరిపితేపై రూ .1,500 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ అదనం. అలాగే వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్జేంజ్‌ ద్వారా 3వేల ఆఫర్‌ కూడా ఉంది. దీంతోపాటు ఆరునెలల వరకు నో కాస్ట్‌ ఈఎంఐ ఆఫర్‌ను అందిస్తోంది.

డ్రా ద్వారా 'లక్కీ స్టార్' గా ఎంపిక చేసిన కస్టమర్‌ ఈ-మెయిల్ ద్వారా క్వాలిఫైయింగ్ ప్రశ్నకు సమాధానమివ్వాలి. అనంతరం లక్కీ విన్నర్‌ను ఎంపిక చేసి డిసెంబర్‌ ఐదో తేదీన ప్రకటిస్తారు. అయితే ఈ ఆఫర్ తమిళనాడులో వర్తించదని కంపెనీ స్పష్టం చేసింది.  వన్‌ప్లస్‌ 6కి కొనసాగింపుగా వన్‌ప్లస్‌ 6టీని భారతదేశంలో గత నెలలో లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే.

వన్ ప్లస్ 6టీ స్మార్ట్ ఫోన్‌లో 6.41అంగుళాల డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, క్వాల్కాం స్నాప్‌డ్రాగెన్ 845 సాక్‌, ఆండ్రాయిడ్ 9 పై, 6జీఈ/ 8జీబీర్యామ్‌, 128స్టోరేజ్‌/256స్టోరేజ్‌ సామర్థ్యంతోపాటు 20+16 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా/ 16ఎంపీ సెల్ఫీ కెమెరా అదనపు ఆకర్షణ కానున్నాయి. అన్ని రకాల వేరియంట్ ఫోన్లలో 3700 ఎంఏహెచ్‌ బ్యాటరీ అమర్చారు. 6 జీబీ ర్యామ్/128 స్టోరేజ్‌ సామర్థ్యం గల ఫోన్ రూ.37,999లకు, 8 జీబీ ర్యామ్/ 128 జీబి స్టోరేజ్‌ సామర్థ్యం గల ఫోన్ రూ.41,999, 256 స్టోరేజ్‌ సామర్థ్యం గల ఫోన్ రూ.45,999లకు లభిస్తాయి. 

10న కాట్స్‌ ఐ డిజైన్‌తో ‘హానర్‌ 8సీ’ ఆవిష్కరణ
మరో చైనా సెల్‌ఫోన్‌ దిగ్గజం హానర్‌ సరికొత్త మొబైల్‌ ఫోన్‌ను ఆవిష్కరించింది. భారీ బ్యాటరీతోపాటు అదిరే ప్రాసెసర్‌తో హానర్‌ 8సీ పేరుతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి రానుంది. డిసెంబర్‌ 10న అమెజాన్‌లో ఎక్స్‌​క్లూజివ్‌గా అమ్మకానికి రానున్నది. రెండు మెమొరీ వేరియంట్లతో కాట్స్‌ ఐ, నలుపు రంగుల్లో రిలీజ్‌ చేస్తారు. క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 632 ప్రాసెసర్‌ను తొలిసారి ఈ ఫోన్‌లోనే వినియోగించారు. ఈ ఫోన్లో 15.9 సెంటీమీటర్ల డిస్‌ప్లేతోపాటు క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 632 ప్రాసెసర్‌ ప్లస్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో అమర్చారు. ఇంకా 13+2 ఎంపీ డ్యూయల్‌ రియర్‌ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ అదనపు ఆకర్షణగా నిలిచాయి. 4+32 జీబీ మోడల్‌ ఫోన్  రూ. 11,999, 4+64 జీబీ మోడల్‌ ఫోన్ రూ.12,999లకు అందుబాటులో ఉంటాయి.

click me!