100 మెగాపిక్సల్ హైపర్ విజన్ కెమెరాతో లెనోవో5జీ...మొదటిసారిగా

By Arun Kumar PFirst Published Mar 28, 2019, 1:39 PM IST
Highlights

చైనా టెక్ దిగ్గజం లెనొవో సుదీర్ఘ విరామం తర్వాత మార్కెట్లోకి హైపర్ విజన్‌తో 100 ఎంపీ సామర్థ్యం గల కెమెరాతో కూడిన జడ్6 ప్రో మోడల్ 5జీ స్మార్ట్ ఫోన్‌ను జూన్‌లో ఆవిష్కరించనున్నది. 

న్యూఢిల్లీ : చైనా మొబైల్‌ మేకర్‌ లెనోవో సుదీర్ఘ విరామం తర్వాత మరో విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. జెడ్‌ సిరీస్‌లో భాగంగా అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో జెడ్‌6 ప్రొ పేరుతో లెనోవో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఇది హైపర్ విజన్ 

100 మెగాపిక్స‌ల్ భారీ కెపాసిటీ హైపర్‌ విజన్‌ కెమెరాతోపాటు, ఎలక్షన్‌ సందర్భంగా ఫేక్‌న్యూస్‌ను అడ్డుకునేందుకు తీసుకొచ్చిన ఫేస్‌బుక్‌ కొత్త టూల్‌, వాట్సాప్‌  డార్క్‌మోడ్‌ అథెంటిఫికేషన్లు కూడా ఏర్పాటు చేసిన‌ట్లు తెలిసింది. 100ఎంపీ కెమెరా సామర్థ్యం ఉన్న తొలి ఫోన్‌ ఇదే కానున్నది. 

ఈ మేర‌కు ఈ ఫోన్‌కు చెందిన ఓ ఇమేజ్‌ను, వీడియోను ఆ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ చాంగ్ చెంగ్ బుధవారం చైనా సోష‌ల్ మీడియా వైబోలో పోస్ట్ చేశారు. ఈ ఏడాది మొబైల్‌ వరల్డ్‌కాంగ్రెస్‌లో దీనిపై ప్రకటించిన సంస్థ జూన్‌ నెలలో మార్కెట్లలో తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఫీచర్లపై ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించకున్నా, అంచనాలు ఇలా ఉన్నాయి. గతేడాది డిసెంబర్ నెలలో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన లెనోవో జడ్5 ప్రో మోడల్ ఫోన్‌లో మాదిరిగా ఖ్వాల్ కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్  12 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌ సామర్థ్యంతోపాటు ప్రధానంగా లెనోవో జ‌డ్‌6 ప్రొ ఫోన్‌లో ఉండే ఫీచర్లని తెలుస్తోంది. అయితే నాన్ 5జీ వేరియంట్ స్మార్ట్ ఫోన్ మాత్రం ఏప్రిల్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫీచర్లు, ప్రత్యేకత వివరాలను లెనొవో బయటపెట్టలేదు. 
 

click me!