వాట్సాప్ లో మరో అద్భుతమైన ఫీచర్

First Published Jul 9, 2018, 4:49 PM IST
Highlights

సదరు లింక్‌లు నిజంగా ప్రమాదకరమైనవే అయితే అవి ఉన్న ఆ మెసేజ్‌లపై వాట్సాప్ అలర్ట్ ఐకాన్‌ను చూపిస్తుంది. దీంతో వాట్సాప్ యూజర్లు సదరు మెసేజ్‌లో ఉన్న లింక్‌ను ఓపెన్ చేయకుంగా జాగ్రత్త పడవచ్చు. 

ప్రముఖ మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో మరో అద్భుతమైన ఫీచర్ రాబోతోంది. సస్పిషియస్ లింక్ డిటెక్షన్ పేరిట ఫీచర్ ని ప్రవేశపెడుతున్నారు. ఈ ఫీచర్ తో వాట్సాప్ లో సర్క్యులేట్ అవుతున్న చాలా వార్తల్లో ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకునే అవకాశం ఉంది.

సదరు లింక్‌లు నిజంగా ప్రమాదకరమైనవే అయితే అవి ఉన్న ఆ మెసేజ్‌లపై వాట్సాప్ అలర్ట్ ఐకాన్‌ను చూపిస్తుంది. దీంతో వాట్సాప్ యూజర్లు సదరు మెసేజ్‌లో ఉన్న లింక్‌ను ఓపెన్ చేయకుంగా జాగ్రత్త పడవచ్చు. 

నేటి తరుణంలో సోషల్ మీడియాలో పుట్టలు పుట్టలుగా నకిలీ మెసేజ్‌లు ఫార్వార్డ్ అవుతున్నాయి. వాటిల్లో ఉండే లింక్‌లు కూడా చాలా వరకు ప్రమాదకరమైనవే ఉంటున్నాయి. వాటి వల్ల యూజర్ల వ్యక్తిగత సమాచారానికి ముప్పు ఏర్పడుతున్నది. దీన్ని నివారించేందుకే వాట్సాప్ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది.

వాట్సాప్ విడుదల చేయనున్న సస్పిషియస్ లింక్ డిటెక్షన్ ఫీచర్‌ను ప్రస్తుతం అంతర్గతంగా పరిశీలిస్తున్నారు. పలు ఎంపిక చేసిన బీటా యూజర్లకు ఈ ఫీచర్ లభిస్తున్నది. త్వరలోనే వాట్సాప్ యూజర్లందరికీ ఈ ఫీచర్ లభ్యం కానుంది.  

click me!