ఫేస్ బుక్‌ లో కొత్త ఫీచర్... అయినా నమ్మలేమంటున్న యూజర్లు

By Arun Kumar P  |  First Published Feb 13, 2019, 4:19 PM IST

ఫేస్ బుక్, గూగుల్ తదితర సోషల్ మీడియా వేదికల యాజమాన్యాలకు సమన్లు జారీ చేయాలని ఐటీ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పలువురు కార్యకర్తలు పిటిషన్లు దాఖలు చేశారు. డేటా ప్రైవసీ, ఆయా సంస్థల పన్ను చెల్లింపు తదితర అంశాలపై ప్రశ్నించాలని ఆ పిటిషన్లో కోరారు. ఈ నెల 25న ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీని తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. పౌరుల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. 


ఫేస్ బుక్, గూగుల్ తదితర సోషల్ మీడియా వేదికల యాజమాన్యాలకు సమన్లు జారీ చేయాలని ఐటీ శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పలువురు కార్యకర్తలు పిటిషన్లు దాఖలు చేశారు. డేటా ప్రైవసీ, ఆయా సంస్థల పన్ను చెల్లింపు తదితర అంశాలపై ప్రశ్నించాలని ఆ పిటిషన్లో కోరారు. ఈ నెల 25న ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీని తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. పౌరుల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. 

త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సోషల్ మీడియా సంస్థల పనితీరుపై ప్రభుత్వ నిఘా క్రమంగా పెరుగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ మరోసారి ప్రభుత్వానికి సారథ్యం వహించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పథకాలపై సోషల్ మీడియాలో విమర్శలు రాకుండా చూసుకునేందుకే పార్లమెంటరీ స్థాయీ సంఘం ఆయా సంస్థల అధినేతలకు సమన్లు జారీ చేస్తున్నది. 

Latest Videos

undefined

సెంటర్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ సిస్టమ్ చేంజ్ ప్రతినిధి కేఎన్ గోవిందాచార్య ఈ మేరకు అనురాగ్ ఠాకూర్ సారథ్యంలోని పార్లమెంటరీ ప్యానెల్‌కు లేఖ రాశారు. ఫేస్ బుక్ గ్లోబల్ హెడ్, ట్విట్టర్, గూగుల్ యాజమాన్యాలను ప్రశ్నించాలని ఆ లేఖలో కోరారు.  

ఇదిలా ఉండగా గత సంవత్సరం యూజర్ల సమాచార దుర్వినియోగం పేరిట సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ పెద్ద సంక్షోభమే ఎదుర్కొంది. అప్పట్లో మన దేశంలోనూ సంస్థకు తాఖీదులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో డేటా సంరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టామంటూ స్వయంగా సంస్థ వ్యవస్థాపకుడు జూకర్‌బర్గ్‌ పలు సార్లు ప్రకటించారు. అందులో భాగంగా సంస్థ ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది.

దీని ద్వారా ప్రొఫైల్‌పై  ప్రకటనల కోసం తమ డేటాను ఎలా వాడుకుంటున్నారో యూజర్లు నేరుగా తెలుసుకోవచ్చు. ‘వై అయామ్ ఐ సీయింగ్‌ దిస్‌ యాడ్‌’పేరుతో ఈ ఫీచర్‌ వినియోగదారుల తెరపై ఫిబ్రవరి 28 నుంచి కనిపించనుంది. గతంలో ఈ ఫీచర్‌ ద్వారా ప్రకటన వెనక ఏ కంపెనీలు ఉన్నాయి, ఎలాంటి వారిని చేరాలనే లక్ష్యంతో ప్రకటనలను పబ్లిష్‌ చేస్తున్నారో తెలిసేది.

అయితే ఇప్పుడు దానికి తోడు యూజర్ల సమాచారం ఎప్పుడు, ఏ కంపెనీలకు ఇచ్చారు, దాన్ని వాడుకోవడానికి అనుమతులు ఎప్పుడు లభించాయి లాంటి అదనపు సమాచారం సైతం ఈ కొత్త ఫీచర్‌ ద్వారా రానుంది. అంటే కంపెనీలు యూజర్ల డేటాను ఏ తేదీన తమ ‘ఫేస్‌బుక్‌ యాడ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’కు జత చేశారో కచ్చితంగా తెలియనుంది.

ఫేస్‌బుక్‌ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సోషల్‌ మీడియా సంస్థ. ప్రకటనల కోసం అనేక కంపెనీలు, సంస్థలు ఫేస్‌బుక్‌ సమాచారం వినియోగించుకుంటాయి. ఇందులో వినియోగదారుల డేటాకు భద్రత లేదన్న వార్తలు వెలువడ్డాయి. అందులో భాగంగా జరిగిందే కేంబ్రిడ్జి ఎనలైటికా ఉదంతం. దీంతో యూజర్ల డేటాను సంరక్షించేందుకు సంస్థ అనేక దిద్దుబాటు చర్యలు తీసుకొంటుంది.
 

click me!