టెలివిజన్ల ధరలు పెరగనున్నాయా.. రాయితీని పొడిగించకపోతే తప్పదంటున్న కంపెనీలు..

By Sandra Ashok KumarFirst Published Sep 14, 2020, 5:50 PM IST
Highlights

 గతేడాది ఓపెన్ సెల్ ప్యానెళ్లపై ప్రభుత్వం 5 శాతం దిగుమతి సుంకం రాయితీ  ఇచ్చింది. అదనంగా, టీవీని తయారు చేయడానికి అవసరమైన పూర్తిగా నిర్మించిన ప్యానెళ్ల రేట్లు 50 శాతానికి పైగా పెంచింది.

కొత్త టి‌వి కొనాలనుకునేవారికి ఇకపై అదనపు భారం పడనుంది. ఎందుకంటే  ఓపెన్ సెల్ ప్యానెల్స్‌పై ప్రభుత్వం ఇచ్చే రాయితీ ఈ నెలాఖరులో నిలిచిపోతుండటంతో వచ్చే నెల నుంచి టెలివిజన్ ధరలు పెరిగే అవకాశం ఉంది. గతేడాది ఓపెన్ సెల్ ప్యానెళ్లపై ప్రభుత్వం 5 శాతం దిగుమతి సుంకం రాయితీ  ఇచ్చింది.

అదనంగా, టీవీని తయారు చేయడానికి అవసరమైన పూర్తిగా నిర్మించిన ప్యానెళ్ల రేట్లు 50 శాతానికి పైగా పెంచింది. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ  దిగుమతి సుంకం రాయితీని విస్తరించడానికి అనుకూలంగా ఉంది. శామ్సంగ్ తన ఉత్పత్తిని వియత్నాం నుండి భారతదేశానికి మార్చింది.

అయితే టీవీ తయారీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు దిగుమతి సుంకం రాయితీని గడువు పెంచేందుకు సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. ఏదేమైనా దీనిపై తుది నిర్ణయం ఆర్థిక మంత్రిత్వ శాఖ తీసుకుంటుంది. సెప్టెంబరు 30 దాటిన డ్యూటీ రాయితీని పొడిగించకపోతే వినియోగదారులకు అదనపు ఖర్చులు చెల్లించాలని టీవీ కంపెనీలు ప్రకటించాయి.

also read 

ఎల్జీ, పానాసోనిక్, థామ్సన్, సాన్సుయ్ టివి ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేశాయి. 32 అంగుళాల టెలివిజన్‌కు 4 శాతం లేదా కనిష్టంగా 600 రూపాయలు, 42 అంగుళాలకు 1,200-1,500 రూపాయలు మేర  ధరలు పెరిగే అవకాశం ఉంది. 

ఓపెన్ సెల్ ప్యానెల్లు టెలివిజన్ ఖర్చులో దాదాపు 60 శాతం. దిగుమతి సుంకం విధించే బదులు, ప్రభుత్వం దశలవారీగా-ఉత్పాదక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాలని తయారీదారులు అంటున్నారు.

ఇండస్ట్రీ బాడీ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సియామా), బిజినెస్ ఛాంబర్ ఫిక్కీ ఈ విషయాన్ని ప్రభుత్వంతో చర్చిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా, ప్యానెల్లను తయారు చేయడానికి అవసరమైన క్యాపిటల్-ఇంటెన్సివ్ ఫ్యాబ్ భారతదేశంలో తయారు చేయలేదు.

click me!