ఏషియన్ రికార్డు బద్దలుకొడుతూ పారా ఒలింపిక్స్ లో రజతం సాధించిన హై జంపర్ ప్రవీణ్ కుమార్

By team teluguFirst Published Sep 3, 2021, 10:09 AM IST
Highlights

టోక్యో పారా ఒలింపిక్స్ లో  ప్రవీణ్ కుమార్ ఏషియన్ రికార్డును బద్దలు కొడుతూ రజతపతకం సాధించాడు

టోక్యో పారా ఒలింపిక్స్ లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తూనే ఉన్నారు. తాజాగా హై జంప్ లో ప్రవీణ్ కుమార్ రజతపతకం సాధించాడు. దీనితో ఇప్పటివరకు భారత్ మొత్తం 11 పతకాలు సాధించింది. పురుషుల హై జంప్ టి 64 ఈవెంట్ లో ప్రవీణ్ కుమార్ 2.07 మీటర్ల ఎత్తు దూకి సిల్వర్ మెడల్ సాధించాడు. 

ఉత్కంఠ భరితంగా నువ్వా నేనా అని సాగిన పోరులో టోక్యో పారా ఒలింపిక్స్ లో  ప్రవీణ్ కుమార్ ఏషియన్ రికార్డును బద్దలు కొడుతూ తన పర్సనల్ బెస్ట్ ని నమోదు చేసాడు. 1.83 మీటర్ల నుంచి ఎత్తును క్రమంగా పోటీకి తగ్గట్టుగా పెంచుతూ వాస్తు చివరకు 2.07 మీటర్ల ఎత్తును దూకి భారత్ కి తన 11వ పతకాన్ని అందించాడు. 

ఇప్పటికే భారత్ కి గోల్డ్ అందించిన అవని లేఖరా తన రెండవ పతకం కోసం పోటీ పడుతూ ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. 50 మీటర్ల రీఫిల్ షూటింగ్ లో అవని ఫైనల్స్ లోకి ప్రవేశించింది. 

పారాలింపిక్స్‌ బ్యాడ్మింటన్స్‌ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లోకి భారత్‌కు చెందిన టాప్‌సీడ్‌ ప్రమోద్‌ భగత్‌ ప్రవేశించాడు. గురువారం జరిగిన గ్రూప్‌-ఏ క్లాస్‌ ఎస్‌ఎల్‌-3 లీగ్‌ మ్యాచ్‌లో ప్రమోద్‌ 21-12, 21-9 తేడాతో ఉక్రెయిన్‌కు చెందిన ఒలెక్‌సాండ్‌ను చిత్తుచేశాడు. ఈ మ్యాచ్‌ను 33ఏళ్ల ప్రమోద్‌ కేవలం 26 నిమిషాల్లో ముగించాడు. గ్రూప్‌-ఏ మరో పోటీలో 28ఏళ్ల సుహాస్‌ 21-9, 21-3 తేడాతో కేవలం 19నిమిషాల్లోనే పోట్‌ను చిత్తుచేయగా.. 

గ్రూప్‌-బిలో తరుణ్‌ 21-7, 21-13తో, కృష్ణ 22-20, 21-10తో ప్రెవైలిడ్‌ను చిత్తుచేశారు. మహిళల సింగిల్స్‌ క్లాస్‌ ఎస్‌యూ5లో జెహ్రాపై కోహ్లీ విజయం సాధించగా, మహిళల డబుల్స్‌లో 19ఏళ్ల కోహ్లీ, పారుల్‌ పర్మార్‌ జంట సెకండ్‌ సీడ్‌ చైనీస్‌ జంట చెంగ్‌ హెఫాంగ్‌, మా హుయిహుయి చేతిలో ఓటమి పాలైంది. ఈ పారాలింపిక్స్‌నుంచే బ్యాడ్మింటన్‌ పోటీలకు అవకాశం దక్కింది.

click me!