మేము గెలవాల్సిన మ్యాచ్ ఇది.. కానీ తడబడ్డాం.. - దక్షిణాఫ్రికా క్రికెట్ టీం కెప్టెన్ టెంబా బావుమా

By team teluguFirst Published Nov 7, 2022, 1:07 AM IST
Highlights

తాము గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయామని దక్షిణాఫ్రికా క్రికెట్ టీం కెప్టెన్ టెంబా బావుమా ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా కొంచెం కష్టపడితే తప్పకుండా విజయం సాధించేవారిమని చెప్పారు. 
 

అడిలైడ్ ఓవల్‌లో ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ప్రోటీస్ 13 పరుగుల తేడాతో ఓడిపోవడంతో తమ జట్టు మళ్లీ తడబడిందని దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా అంగీకరించాడు . “ ఇది చాలా నిరాశపరిచింది. ఈ గేమ్‌కు ముందు మేం బాగా ఆడాం. ఇది తప్పక గెలవాల్సిన గేమ్ అని మాకు తెలుసు. అయినా మేం తడబడ్డాము. మా టీం దీనిని తట్టుకోలేకపోతోంది.’’ అని మ్యాచ్ అనంతరం బావుమా చెప్పాడు.

ఒంటి చేత్తో క్యాచ్ పట్టిన హార్దిక్ పాండ్యా.. రోహిత్ శర్మ రియాక్షన్.. సోషల్ మీడియాలో వైరల్

“పాకిస్తాన్ తో మ్యాచ్ సమయంలోనూ ఇలాగే జరిగింది. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయాం. ఇంకా కొంచెం కష్టపడి ఉండాల్సింది. అయితే వారు మాకన్న చాలా బాగా ఆడారు. ” అని బావుమా తెలిపారు. ‘‘మేము అలా చేసి ఉండకూడదు. ముందుగా మేమే టాస్ గెలిచాం. బౌలింగ్ ఎంచుకున్నాం. అయినా ప్రత్యర్థి టీంను 158 స్కోరు చేయనివ్వాల్సింది కాదు. ’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

గెలిచినప్పుడే కాదు.. ఓడినప్పుడూ తోడుగా ఉండాలి: పాకిస్తాన్ క్రికెటర్ వేడుకోలు.. (వీడియో)

ఇదిలా ఉండగా.. నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ తమ విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. తదుపరి టీ 20 ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించాలనే లక్ష్యాన్ని సాధించామని చెప్పాడు. 26 బంతుల్లో 41 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైన కోలిన్ అకెర్‌మాన్ చూపిన అంకితభావమే ఈ విజయమని అన్నాడు. “ ఇది అద్భుతంగా అనిపిస్తుంది, ఈ రోజు ఈ విజయానికి నిజంగా అకెర్‌మాన్ అర్హుడు. మా టీం మొత్తం ఆరు నెలలుగా చాలా కష్టపడ్డారు.” అని ఆయన అన్నారు. 

click me!