మరీ ఇంతటి పతనమా...30 ఏళ్ల తర్వాత ఫాలో ఆన్ ఆడుతున్న ఆసీస్

By sivanagaprasad KodatiFirst Published Jan 6, 2019, 12:06 PM IST
Highlights

ఒకప్పుడు వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియా ఇప్పుడు వరుస వివాదాలతో, సీనియర్ ఆటగాళ్లు లేక పతనావస్థకు చేరుకుంది. ప్రస్తుతం బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో ఆసీస్ ఓటమి దిశగా సాగుతోంది

ఒకప్పుడు వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియా ఇప్పుడు వరుస వివాదాలతో, సీనియర్ ఆటగాళ్లు లేక పతనావస్థకు చేరుకుంది. ప్రస్తుతం బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో ఆసీస్ ఓటమి దిశగా సాగుతోంది.

తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకే అలౌటై ఫాలోఆన్‌ గండాన్ని తప్పించుకోలేకపోయింది. ఇలా సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడటం 30 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారంటే ఆ జట్టు ఎలాంటి పరిస్ధితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

1988లో సిడ్నీ గ్రౌండ్‌లోనే ఇంగ్లాండ్‌తో ఫాలో ఆన్ ఆడిన ఆసీస్ ఆ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.. దేశానికి అవతల కూడా చివరగా 2005లో ట్రెండ్ బ్రిడ్జ్‌లో ఇంగ్లాండ్‌పైనే ఫాలో ఆన్ ఆడగా ఆ మ్యాచ్‌లో ఆసీస్ ఓటమి పాలైంది.

ప్రస్తుతం భారత్ 322 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది.. వర్షం కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇంకా ఒక రోజు ఆట మిగిలి ఉంది. ఈ మ్యాచ్ డ్రా అయినా సిరీస్‌లో ఇప్పటికే 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేనకే సొంతం కానుంది. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరిస్ నెగ్గిన తొలి భారత జట్టుగా రికార్డు సృష్టించనుంది.

 

సిడ్నీ టెస్టు: రెండో ఇన్నింగ్సు ప్రారంభించిన ఆస్ట్రేలియా

‘‘పంత్.. ధోనీని దాటేస్తాడు’’

కేఎల్ రాహుల్ నిజాయితి... అంపైర్ ప్రశంసలు

సిడ్నీ టెస్టులో కోహ్లీకి అవమానం...

ఆసిస్ సెలెక్టర్లకు బుర్ర లేదు: విరుచుకుపడ్డ షేన్‌వార్న్

ధోని పాకిస్థాన్ రికార్డును బద్దలుగొట్టిన పంత్.... 12ఏళ్ల తర్వాత

click me!