సిడ్నీ టెస్టులో కోహ్లీకి అవమానం...

By Arun Kumar PFirst Published Jan 5, 2019, 8:28 AM IST
Highlights

టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసిస్ ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు తమ అక్కసును వెల్లగక్కుతూనే ఉన్నారు. బోర్డన్ గవాస్కర్ ట్రోపిలో భాగంగా జరుగుతున్న టెస్ట్ సీరిస్‌లో అడుగడుగునా అతడిని అవమానిస్తూ ఆస్ట్రేలియా అభిమానులు రాక్షసానందం పొందుతున్నారు. మొదటి టెస్టులో కోహ్లిని ఉద్దేశిస్తూ పోడియంలోని ఆసిస్ అభిమానులు అనుచిన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సిడ్నీ టెస్టులోనే కోహ్లీకి అలాంటి  చేదు అనుభవమే ఎదురయ్యింది. 

సిడ్నీ టెస్టులో బ్యాటింగ్ చేస్తున్న కోహ్లీని వెక్కిరిస్తూ ఆసిస్ అభిమానులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోడియంలో నుండి గట్టిగా అరుస్తూ ఆసిస్ ప్రేక్షకులు నానాహంగామా  చేశారు.  వీరి వ్యాఖ్యలు ఈ మ్యాచ్ ని ప్రసారం చేస్తున్న చానెల్ కెమెరాలో రికార్డయ్యాయి. దీంత ఈ విషయం ఆసిస్ క్రికెట్ బోర్డు అధికారుల దృష్టికి వెళ్లింది. 

దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కెవిన్ రాబర్ట్స్ ఆసిస్ అభిమానులను హెచ్చరించారు. తమ దేశంలో పర్యటిస్తున్న అతిథులను గౌరవించచడం కనీస మర్యాద  అని..దాన్ని అభిమానులు పాటించాలన్నారు. వారు తిరిగి వెళ్లేటపుడు మన దేశం అందించే మధురమైన జ్ఞాపకాలతో వారు తిరిగి వెళ్లాలి కానీ ఇలా చేదు అనుభవాలతో కాదని పేర్కొన్నారు. మైదానంలో ఆటగాళ్లు ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి ప్రయత్నించాలి కానీ ఇలా మైదానం బయట కాదన్నారు. ఇతర దేశాల ముందు తమ దేశ పరువు తీసేలా వ్యవహరించకూడదంటూ ఆసిస్ అభిమానులకు రాబర్ట్స్ సూచించారు. 

మొదటి టెస్టులో ఆసిస్ కెప్టెన్ పైన్ కవ్వింపు చర్యలకు కోహ్లీ దీటుగా జవాబిచ్చాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి ఇద్దరు కెప్టెన్లు ఒకరిపై మరొకరు దూసుకుపోయేంత సీరియస్ పరిస్థితి ఏర్పడింది. అప్పటినుండి ఆస్ట్రేలియా ఆటగాళ్లు, మీడియా, అభిమానులు కోహ్లీపై కక్షగట్టారు. అతడిని విలన్ చూపించే ప్రయత్నాలు చేస్తూనే... టీంఇండియా ఆటగాళ్ళు, జట్టును అవమానించేలా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. 
 
click me!