శ్రీజేష్ కల సాకారం చేసేందుకు తండ్రి కృషి..!

By telugu news teamFirst Published Aug 7, 2021, 10:49 AM IST
Highlights

అతను తన పతకాన్ని, విజయాన్ని తండ్రికి అంకితమి స్తానంటూ చేసిన ట్వీట్ అభిమానులను ఆకట్టుకుంది. అయితే.. శ్రీజేష్ అలా అనడానికి కారణం లేకపోలేదు. 


భారత పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలంపిక్స్ లో అదరగొట్టింది. ఈ జట్టు గెలవడానికి గోల్ కీపర్  శ్రీజేష్ కీలక పాత్ర పోషించాడు. అయితే.. శ్రీజేష్ ఈ రోజు ఈ స్థాయికి ఎదగడానికి ఆయన తండ్రి చాలానే కష్టపడ్డారు. పతకం గెలిచిన ఆనందంలో.. శ్రీజేష్.. ట్విట్టర్ చూస్తే అర్థమౌతుంది. అతను తన పతకాన్ని, విజయాన్ని తండ్రికి అంకితమి స్తానంటూ చేసిన ట్వీట్ అభిమానులను ఆకట్టుకుంది. అయితే.. శ్రీజేష్ అలా అనడానికి కారణం లేకపోలేదు. శ్రీజేష్ కోసం అతని తండ్రి.. చాలా కష్టపడ్డారు. ఒకానొక సమయంలో కొడుక్కి హాకీ కిట్ కొనిపెట్టడానికి ఏకంగా.. వారి ఇంట్లో ఆవును కూడా అమ్మేశారు. 

1998లో తన 12 ఏళ్ల వయసులో హాకీ నేర్చుకునేందుకు తిరువనంతపురంలోని జీవీ రాజా స్పోర్ట్స్‌ స్కూల్‌లో చేరాడు. అయితే ఆ స్కూల్‌ హాకీ కోచ్‌ శ్రీజేష్‌ను గోల్‌ కీపింగ్‌ చేయమని సలహా ఇచ్చాడు. కోచ్‌ చెప్పిన విషయాన్ని శ్రీజేష్‌ తన తండ్రికి వివరించాడు. కొడుకు కలను సాకారం చేసేందుకు తండ్రి పీవీ రవీంద్రన్ తన ఇంటి దైవంగా భావించిన ఆవును అమ్మేసి శ్రీజేష్‌కు గోల్‌ కీపింగ్‌ కిట్‌ను కొనిచ్చాడు. 

అయితే ఆ సమయంలో రవీంద్రన్‌ శ్రీజేష్‌కు ఒక మాట చెప్పాడు. '' ఈరోజు నీ భవిష్యత్తు కోసం నా ఇంటి దైవాన్ని తాకట్టు పెడుతున్నా. నువ్వు అనుకున్న కలను సాధించాలి..  హాకీలో గోల్‌ కీపర్‌గా మెరవాలి.. దేశానికి పతకం తేవాలి.'' అని చెప్పుకొచ్చాడు. తండ్రి మాటలను శ్రీజేష్‌ ఈరోజుతో నెరవేర్చాడు. టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో తన గోల్‌ కీపింగ్‌తో మెప్పించి దేశానికి కాంస్యం అందించాడు. ఇటు తండ్రి కోరికను నెరవేర్చడంతో పాటు ఒలింపిక్స్‌లో 41 సంవత్సరాల పతక నిరీక్షణకు తన జట్టుతో కలిసి తెరదించాడు.

click me!