సచిన్ కాదని... కోహ్లీకి ఓకే చెప్పిన అఫ్రీది... విమర్శలు

By telugu teamFirst Published May 10, 2019, 4:55 PM IST
Highlights

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అఫ్రీది... మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. దాదాపు అఫ్రీది నోటి నుంచి ఏ మాట వచ్చినా... అది వివాదం కిందకే మారుతుంది. 

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అఫ్రీది... మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. దాదాపు అఫ్రీది నోటి నుంచి ఏ మాట వచ్చినా... అది వివాదం కిందకే మారుతుంది. ఇటీవల గేమ్ ఛేంజర్ పేరిట ఓ పుస్తకాన్ని రాసి... గంభీర్ పై విమర్శలు గుప్పించాడు. ఆ వివాదం ముగిసిన తర్వాత ఆల్‌టైం ప్రపంచకప్‌ జట్టును కూడా ప్రకటించి మరో దుమారానికి తెరలేపాడు. 

ఆ జట్టులో భారత మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌తో పాటు భారత జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీకి చోటు ఇవ్వకపోగా...కోహ్లీ పేరు మాత్రం ప్రస్తావించాడు. దీంతో... దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాగా... దీనిపై అఫ్రీది స్పందించాడు.

‘సచిన్‌, ధోనీ భారత క్రికెట్‌కు ఎంతో కీర్తి తెచ్చిపెట్టారు. వాళ్లను కించపరచడం నా ఉద్దేశం కాదు. కోహ్లీని ఎంచుకోవడానికి కారణం అతని బ్యాటింగ్‌ మాయాజాలమే. కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. రెండు దేశాల మధ్య విద్వేషాలను తగ్గించేందుకు క్రికెట్‌ మంచి మార్గం. అందుకే భారత్‌, పాకిస్థాన్‌ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలి. అలా అయితేనే రెండు దేశాల ప్రజల  మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి’ అని అఫ్రిది పేర్కొన్నాడు.

click me!