రిషబ్ పంత్ సర్కస్ ఫీట్‌కు ఫిదా అవుతున్న అభిమానులు (వీడియో)

By Arun Kumar PFirst Published Jan 4, 2019, 5:15 PM IST
Highlights

ఆస్ట్రేలియా టెస్ట్ సీరిస్‌ భారతీయ యువ ఆటగాడు రిషబ్ పంత్ హీరోగా మార్చేసింది. కేవలం బ్యాటింగ్ ప్రదర్శనతోనే కాదు ప్రవర్తనతోనూ వార్తల్లో నిలిచాడు. తాజాగా అతడు సరదాగా చేసిన ఓ ఫీట్ భారతీయులనే కాదు దేశవ్యాప్తంగా వున్న క్రీడాభిమానులను ఆకట్టుకుటోంది. అతడిని చూసి యువ క్రీడాకారులు ఫీట్ గా వుండటం ఎలాగో నేర్చుకోవాలంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ కురుస్తోంది. 

ఆస్ట్రేలియా టెస్ట్ సీరిస్‌ 21ఏళ్ల భారతీయ యువ ఆటగాడు రిషబ్ పంత్ హీరోగా మార్చేసింది. కేవలం బ్యాటింగ్ ప్రదర్శనతోనే కాదు ప్రవర్తనతోనూ వార్తల్లో నిలిచాడు. తాజాగా అతడు సరదాగా చేసిన ఓ ఫీట్ భారతీయులనే కాదు దేశవ్యాప్తంగా వున్న క్రీడాభిమానులను ఆకట్టుకుటోంది. అతడిని చూసి యువ క్రీడాకారులు ఫీట్ గా వుండటం ఎలాగో నేర్చుకోవాలంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ కురుస్తోంది. 

సిడ్నీ టెస్టులో రిషబ్ అద్భుతమైన సెంచరీతో రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఇలా చాలాసేపు బ్యాటింగ్ చేసిన ఆటగాళ్లు భాగా అలసిపోతారు. వికెట్ల మద్య పరుగెత్తడానికి కూడా ఆయాసపడుతుంటారు. అలాంటికి రిషబ్ పంత్ మాత్రం సెంచరీ తర్వాత కూడా ఎలాంటి అలసట లేకుండా మరింత రెచ్చిపోతూ బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో డ్రింక్స్ సమయంలో అతడు చేసిన ఓ ఫీట్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. 

అంపైర్లు డ్రింక్ విరామం ప్రకటించడంతో బ్యాటింగ్ చేస్తున్న రిషబ్ పంత్ కొద్దిసేపు గ్రౌండ్లోనే వెల్లకిలా పడుకున్నాడు. అయితే అందరూ అతడు చాలాసేపు బ్యాటింగ్ చేయడం వల్ల అలసిపోయాడని భావించారు. కానీ పంత్ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో డబ్ల్యూడబ్ల్యూ స్టార్‌ షాన్‌ మైకెల్స్‌ స్టైల్లో అమాంతం పైకి లేచాడు. ఇలా పంత్ సర్కస్ ఫీట్ ను చూసిన అభిమానులు అతడి పిట్ నెస్ పై చర్చించుకుంటున్నారు. యువ క్రీడాకారులంతా పంత్ మాదిరిగా ఫిట్ నెస్ కాపాడుకోవాలంటూ సూచిస్తున్నారు.  

వీడియో 

Not bad! pic.twitter.com/QuyrfFcfpD

— cricket.com.au (@cricketcomau) January 4, 2019


మరిన్ని వార్తలు

ధోని పాకిస్థాన్ రికార్డును బద్దలుగొట్టిన పంత్.... 12ఏళ్ల తర్వాత

బ్యాటింగ్ తో దుమ్మురేపిన పంత్.. అభిమానుల పాట

రికార్డ్ బ్రేక్: ధోనీ వల్ల కానిది పంత్ సాధించాడు

సిడ్నీ టెస్ట్: 622 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్

సిడ్నీ టెస్ట్: ముగిసిన తొలి రోజు ఆట, భారత్ 303/4

మయాంక్ రికార్డుల మోత

సచిన్ ముందు, వెనుక స్థానాలు పుజారావే...

పింక్ గ్లౌవ్స్, బ్యాట్‌తో బరిలోకి దిగిన కోహ్లీ ...విశేషమేంటబ్బా?

నల్లటి బ్యాడ్జీలతో గ్రౌండ్‌లోకి దిగిన ఆసీస్, భారత్ క్రికెటర్లు...ఎందుకంటే

పుజారా రికార్డు: దిగ్గజాల జాబితాలో చోటు

click me!