ప్రపంచ ఛాంపియన్ గా పీవీ సింధు.. విజయం వెనక ఇతనే

By telugu teamFirst Published Aug 27, 2019, 11:29 AM IST
Highlights

రెండేళ్ల తర్వాత అదే జపాన్ షట్లర్ నొజొమి ఒకుహరతో పోరాడి విజయం సాధించింది.  ఒకుహర బలహీనతలను లక్ష్యంగా చేసుకొని ఆమెపై ఎదురు దాడికి దిగింది. ర్యాలీలు ఆడడంలో జపాన్‌ షట్లర్లు సిద్ధహస్తులు. అందునా నొజొమికి ర్యాలీలలో తిరుగుండదు. కానీ ఆమె ర్యాలీలను బాడీ స్మాష్‌లతో తిప్పికొట్టిన సింధు.. ఒకుహరను డిఫెన్స్‌లో పడేసింది. 

భారతీయుల 40ఏళ్ల కలను పీవీ సింధు నిజం చేసింది. బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ని కైవసం చేసుకొని  దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటింది. 2017లో కూడా విజయం సింధూదే అని అందరూ భావించారు. కానీ... తీవ్ర ఒత్తిడికి లోనై సింధూ పిసిడి చేజార్చుకుంది.  దీంతో జపాన్ షట్లర్ నొజొమి ఒకుహర పసిడి గెలుచుకోగా... సింధు రజతంతో సరిపెట్టుకుంది.

రెండేళ్ల తర్వాత అదే జపాన్ షట్లర్ నొజొమి ఒకుహరతో పోరాడి విజయం సాధించింది.  ఒకుహర బలహీనతలను లక్ష్యంగా చేసుకొని ఆమెపై ఎదురు దాడికి దిగింది. ర్యాలీలు ఆడడంలో జపాన్‌ షట్లర్లు సిద్ధహస్తులు. అందునా నొజొమికి ర్యాలీలలో తిరుగుండదు. కానీ ఆమె ర్యాలీలను బాడీ స్మాష్‌లతో తిప్పికొట్టిన సింధు.. ఒకుహరను డిఫెన్స్‌లో పడేసింది. 

నెట్‌ గేమ్‌తో, స్మాష్‌లతో ఒకుహరను కోర్టు నలుమూలలా పరుగులు పెట్టించింది. సింధు ఆటతీరు ఇంత అద్భుతంగా మారడానికి కారణం.. కొత్త కోచ్‌ కిమ్‌ జి హ్యున్‌. అందుకే మ్యాచ్‌ అనంతరం సింధు.. కిమ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. వర్ధమాన షట్లర్లను తీర్చిదిద్దాల్సి ఉండడంతో కొంతకాలం కిందట సింధు, సైనా కోచింగ్‌ బాధ్యతలనుంచి గోపీచంద్‌ వైదొలిగాడు.

click me!