ప్రో కబడ్డి 2019: ఆరంభమ్యాచ్ లోనే అదరగొట్టిన యూ ముంబా...తెలుగు టైటాన్స్ ఓటమి

By Arun Kumar PFirst Published Jul 20, 2019, 8:50 PM IST
Highlights

హైదరాబాద్ లోని గచ్చబౌలి స్టేడియంలో ప్రో కబడ్డి సీజన్ 7 అట్టహాసంగా ఆరంభమైంది. అయితే ఆరంభ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ జట్టుకు మాత్రం శుభారంభం లభించలేదు. ఆరు పరుగుల తేడాతో యూ ముంబా విజయం సాధించింది. 

హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రో కబడ్డి లీగ్ సీజన్-7 ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా జరిగిన మొదటి మ్యాచ్ యూ ముంబా శుభారంభం చేసింది. స్థానిక జట్టయిన తెలుగు టైటాన్స్ ఆరు పాయింట్స్ తేడాతో  ఓటమిపాలయ్యింది. ఫస్ట్ హాఫ్ లో పూర్తిగా విఫలమైన టైటాన్స్  జట్టు సెంకండాఫ్ లో పుంజుకున్నా విజయాన్ని మాత్రం అందుకోలేక పోయింది. 

ముంబై ఆటగాడు అభిషేక్ సింగ్ ఈ మ్యాచ్ లో అదరగొట్టాడు. అతడు మొత్తం 10 రైడ్ పాయింట్స్ సాధించి ముంబై విజయంలో కీలకపాత్ర  పోషించాడు. ఇక  మిగతావారిలో రోహిత్ బలియాన్ 4 రైడ్ పాయింట్స్,  సందీప్ నర్వాల్ 4, ఫజల్ 4,  సురీందర్ సింగ్ 2 టాకిల్ పాయింట్స్ సాధించారు. అలాగే అతుల్ ఓ రైడ్ పాయింట్, మరో బోనస్ పాయింట్ అందించాడు. తెలుగు టైటాన్స్ ను ఆలౌట్ చేయడం ద్వారా ముంబై జట్టుకు మరో 4 పాయింట్లు అదనంగా లభించాయి. దీంతో ఆ జట్టు మొత్తం 31 పాయింట్స్ సాధించింది. 

ఇక తెలుగు టైటాన్స్ విషయానికి వస్తే రైడర్లు అద్భుతంగా ఆడినా డిఫెండర్స్ ఆకట్టుకోలేకపోయారు. ఆ జట్టు సాధించిన మొత్తం 25 పాయింట్లలో 15 రైడర్స్ సాధించినవే. అత్యధికంగా రజనీశ్ 8 పాయింట్లతో ఆకట్టుకోగా,   సిద్దార్థ్ దేశాయి 5, రాకుశ్ గౌడ 4, పర్హాద్ 3, అడోజర్ 2, విశాలం 2, అరుణ్ 1 పాయింట్ సాధించారు.

 ఇలా మొదటి మ్యాచ్ లోనే యూ ముంబా జట్టు సమిష్టిగా ఆడుతూ నాలుగు సార్లు టైటాన్స్ ను ఆలౌట్ చేయగలిగింది. మ్యాచ్ ఆసాంతం ఆధిక్యాన్ని కనబర్చి ముంబై జట్టు చివరకు   25-31 తేడాతో విజయాన్ని అందుకుంది.  

click me!