ప్రో కబడ్డి 2019: బెంగాల్ వారియర్స్ చేతిలో చిత్తు చిత్తుగా ఓడిన పుణేరీ పల్టాన్

By Arun Kumar PFirst Published Jul 29, 2019, 9:49 PM IST
Highlights

ప్రో కబడ్డి లీగ్ 2019 లో బెంగాల్ వారియర్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. పుణేరీ పల్టాన్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 20 పాయింట్ల భారీ తేడాతో బెంగాల్ ఘన విజయాన్ని సాధించింది.  

ప్రో కబడ్డి లీగ్ లో బెంగాల్ వారియర్స్ మరో అద్భత విజయాన్ని అందుకుంది. ముంబైలోని సర్దావ్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో పుణేరీ పల్టాన్ తో జరిగిన మ్యాచ్ బెంగాల్ అదరగొట్టింది. ముఖ్యంగా  స్టార్ రైడర్ మణీందర్ సింగ్ 14 పాయింట్స్ తో చెలరేగడంతో బెంగాల్ కు అడ్డులేకుండా పోయింది. దీంతో ఏకంగా 20 పాయింట్ల తేడాతో పుణేను చిత్తు చిత్తుగా  ఓడించగలిగింది. 

మ్యాచ్ ఆరంభం నుండి పుణే జట్టు ఏ దశలోనూ బెంగాల్ కు పోటీనివ్వలేకపోయింది. ఇలా మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. వారియర్స్ జట్టులో మణీందర్ సింగ్ 14, ఇస్మాయిల్ నబీభక్ష్ 8 పాయింట్లతో ఆకట్టుకున్నారు. మిగతావారిలో రింకు నర్వాల్ 5, విరజ్ విష్ణు 3, బల్దేవ్ 3, జీవా 1 పాయింట్ సాధించారు.

ఇలా కేవలం రైడర్స్ మాత్రమే 22 పాయింట్లతో మెరవగా 3 సూపర్ ట్యాకిల్స్, 12 ట్యాకిల్ పాయింట్లు సాధించి డిపెండర్స్ కూడా వారియర్స్ విజయంలో కీలకంగా వ్యవహరించారు. ఇక ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం ద్వరా 6, ఎక్స్‌ట్రాల రూపంలో మరో 3 పాయింట్లు లభించడంతో మొత్తం బెంగాల్ స్కోరు 43 కు చేరింది. 

ఇక బెంగాల్ ఊపు ముందు పుణేరీ పల్టాన్స్ నిలవలేకపోయింది.  పంకజ్ మోహితే ఒక్కడే 6 పాయింట్లతో కాస్త పరవాలేదనిపించాడు. ఇలా రైడింగ్ లో కేవలం 13, ట్యాకిల్స్ లో 9, ఎక్స్‌ట్రాల రూపంలో 1  మొత్తం 23 పాయింట్లను మాత్రమే చేయగలిగింది. ఇలా పుణే 43-23 పాయింట్ల తేడాతో బెంగాల్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. 
 

click me!