స్టార్ క్రికెటర్ కు కుక్కకాటు...మ్యాచ్ కి దూరం

By rajesh yFirst Published Sep 18, 2018, 8:34 PM IST
Highlights

తాను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న శునకం యజమానినే తిరిగి కాటు వేస్తే...అలాంటి పరిస్థితే ఎదురైంది ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డీఆర్కీ షార్ట్ కు. ఇంట్లో పెంచుకుంటున్న తన పెంపుడు కుక్క కరవడంతో షార్ట్ ఏకంగా ఒక మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

పెర్త్: తాను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న శునకం యజమానినే తిరిగి కాటు వేస్తే...అలాంటి పరిస్థితే ఎదురైంది ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డీఆర్కీ షార్ట్ కు. ఇంట్లో పెంచుకుంటున్న తన పెంపుడు కుక్క కరవడంతో షార్ట్ ఏకంగా ఒక మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 

రాల్ఫీ అని ముద్దుగా పిలుచుకునే  పెంపుడు శునకంతో షార్ట్ ఆడుకుంటూ ఉండగా పొరపాటున అది అతడి మోచేతిని కరిచింది. దీంతో మోచేతికి కుట్లు పడ్డాయి. చిన్నసర్జరీ కూడా చెయ్యాల్సి వచ్చిందట. ఫలితంగా షార్ట్ న్యూసౌత్‌వేల్స్‌పై జరిగే జేఎల్‌టీ వన్డేకప్‌ తొలి మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
 
కొత్తగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చిన డీఆర్కీ షార్ట్‌కు ఇది నిజంగా ఎదురుదెబ్బేనని సైన్స్ స్పోర్ట్స్ మెడిసిన్ మేనేజర్ నిక్ జోన్స్ పేర్కొన్నాడు డీఆర్కీ షార్ట్ త్వరగా కోలుకుని మళ్లీ జట్టులోకి రావాలని ఆకాంక్షించాడు. రెండు వారాల క్రితం డీఆర్కీ తన పెంపుడు శునకంతో ఆడుకుంటూ ఉండగా దురదృష్ట వశాత్తూ గాయపడ్డాడు. 

కుక్కకాటు కారణంగా షార్ట్ చేతిపై లోతైన గాయం అయ్యిందని జోన్స్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. చేతిపై కొన్ని కుట్లు పడడంతో పాటు, చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం ప్రాక్టీస్‌లో ఉన్న షార్ట్  త్వరలోనే జట్టులోకి వస్తాడని తెలిపాడు. 

click me!