MTB Himachal Janjehli 2022 1st Edition : ముగిసిన స్టేజ్-1 రేస్.. 54 మంది రైడర్లు, 80 కి.మీల మేర సాగిన పోటీ

By Siva KodatiFirst Published Jun 25, 2022, 5:38 PM IST
Highlights

ఎంటీబీ హిమాచల్ జంజెహ్లీ 2022 తొలి ఎడిషన్ స్టేజ్ 1లో దేశవ్యాప్తంగా నాలుగు వందల మంది రైడర్‌లు పాల్గొన్నారు. డాక్ బంగ్లా నుంచి చిండి వరకు శుక్రవారం జరిగిన మౌంటెన్ బైకింగ్ రేస్ సీపూర్, గుమ్మా, చాబా, సున్నీ, తట్టపాని, అల్సిండి, చురగ్‌ల మీదుగా మొత్తం 88 కి.మీల సాగింది. 

 

శుక్రవారం జరిగిన ఎంటీబీ హిమాచల్ జంజెహ్లీ 2022 తొలి ఎడిషన్ స్టేజ్ 1లో దేశవ్యాప్తంగా నాలుగు వందల మంది రైడర్‌లు పాల్గొన్నారు. నిర్వాహకులు తెలియజేసిన వివరాల ప్రకారం.. మౌంటేన్ బైకింగ్ రేస్ పుట్టిన ఉద్దేశం ‘శతద్రు’ 100 కోర్సులను ప్రదర్శించడానికి. పురాణాల ప్రకారం.. శతద్రుడు ప్రాంతం ఒకప్పుడు రాక్షసులు, మొసళ్లతో నిండి వుండేది. వశిష్టుడు దానిలోకి దూకినప్పుడు అది 100 గచ్చులుగా విడిపోయి, ఆయన ఒక భూభాగంలో  పడ్డాడు. శతద్రు ఈ రోజు సట్లెజ్ పేరుతో చలామణి అవుతోంది. 

 

 

డాక్ బంగ్లా నుంచి చిండి వరకు శుక్రవారం జరిగిన మౌంటెన్ బైకింగ్ రేస్ సీపూర్, గుమ్మా, చాబా, సున్నీ, తట్టపాని, అల్సిండి, చురగ్‌ల మీదుగా మొత్తం 88 కి.మీల సాగింది. స్టేజ్ 1 మార్గం శక్తివంతమైన శతద్రు.. దాని ఉపనదులు, ఒడ్డు ఇలా పురాణాలలో పేర్కొన్న ప్రాంతాలకు రైడర్‌లను తీసుకెళ్లింది. నది ప్రవాహం ప్రారంభమయ్యే 2,300 మీటర్ల ఎత్తు నుంచి 690 మీటర్ల దిగువ వరకు రైడ్ సాగింది. 2000 మీటర్ల వద్ద అధిరోహణ ప్రారంభమైంది. ఈ రైడ్‌లో అత్యల్ప తక్కువ ఎత్తులో వున్నది సున్నీ బ్రిడ్జ్ (800 మీటర్లు) కాగా... అత్యంత ఎత్తైన పాయింట్ చురాహ్ (2000 మీటర్లు)లను రైడర్లు టచ్ చేశారు. 

 

 

మొదటి రోజు రైడ్ అద్భుతంగా జరగ్గా.. రెండవ దశ కోసం ఎదురుచూస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో సైక్లింగ్ టూరిజాన్ని ప్రోత్సహించడం ఈ ఈవెంట్ ముఖ్యోద్దేశం. ముఖ్యంగా ఆ హిమాలయ రాష్ట్రం అందించే అందమైన ట్రాక్‌లు, ట్రయల్స్ మీదుగా సైక్లింగ్ చేయడం ఒక సవాల్. హిమాచల్ టూరిజం, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, హిమాలయన్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అండ్ టూరిజం ప్రమోషన్ అసోసియేషన్ (హెచ్‌ఏఎస్‌టీపీఏ) ఈ ప్రత్యేకమైన మౌంటేన్ బైకింగ్ రేసును నిర్వహిస్తోంది. 

 

 

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 54 మంది రైడర్లు స్టార్టింగ్ పాయింట్ నుంచి రైడ్ ప్రారంభించారు. మొదటి దశ ఆధారంగా ఫలితాలివే.

అండర్ 16 కేటగిరీ:

1. యుగల్ ఠాకూర్
2. వంశ్ ఠాకూర్
3. దివ్యాన్ష్ కౌశల్

 

 

అండర్ -19 కేటగిరీ (బాలురు)

1. అర్పిత్ శర్మ
2. విశాల్ ఆర్య
3. కునాల్ బన్సాల్

అండర్ - 19 కేటగిరీ (బాలికలు)

1. కైనా సూద్
2. దివిజా సూద్

 

 

అండర్ -23 కేటగిరీ (బాలురు)

1. అమన్‌దీప్ సింగ్స
2. పృథ్వీరాజ్ సింగ్ రాథోడ్

అండర్ -23 కేటగిరీ (బాలికలు)

1. సునీతా శ్రేష్ట
2. అస్తా దోబాల్

అండర్ -35 కేటగిరీ (పురుషులు)

1. రాకేష్ రాణా
2. కృష్ణవేంద్ర యాదవ్
3. రామకృష్ణ పటేల్

అండర్ -50 కేటగిరీ (పురుషులు)

1. సునీల్ బంగోరా
2. అమిత్ బలియన్
 

click me!