చాలా విషయాలు భారత్ కు అనుకూలంగా నిలిచాయి - పాక్ క్రికెటర్ షాన్ మసూద్

By team teluguFirst Published Nov 7, 2022, 1:50 AM IST
Highlights

టీ20 ప్రపంచ కప్ లో భారత్ తో, జింబాబ్వే తో తలపడ్డ పాకిస్థాన్ క్రికెట్ టీం.. రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయింది. అయితే ఈ ఓటమికి గల కారణాలను పాక్ క్రికెటర్ షాన్ మసూద్ ఓ మీడియా కాన్ఫరెన్స్ లో తెలిపారు. 

భారత్ తో జరిగిన టీ20 ప్రపంచ కప్ లో పాకిస్థాన్ టీం చిత్తుగా ఓడిపోయింది. తరువాత జింబాబ్వే చేతిలోనూ ఓటమిపాలయ్యింది. ఈ రెండు మ్యాచ్ ల పరాభవంపై పాక్ క్రికెటర్ షాన్ మసూద్.. బంగ్లాదేశ్‌తో జరిగిన పాక్ చివరి గ్రూప్ గేమ్ సందర్భంగా ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మ్యాచ్ గెలిచిందుకు టీం ఎంతగా పోరాడిందో వెల్లడించారు.

హనీ ట్రాప్ లో ఢిల్లీ క్రికెటర్.. యువతితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్.. చివరికి..

‘‘ మేము కీలకమైన క్షణాలను సద్వినియోగం చేసుకోలేదు. భారత్‌తో జరిగిన చివరి బంతిలో మేము ఓడిపోయాము. ఒక దశలో భారత్‌కు 8 బంతుల్లో 28 పరుగులు అవసరమైనప్పుడు మేము గెలుస్తామని అనుకున్నాం. కానీ అలా జరగలేదు. ఆ సమయంలో చాలా విషయాలు భారత్‌కు అనుకూలంగా జరిగాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చేసరికి వారికి పరిస్థితులు మెరుగయ్యాయి. కానీ ఓవరాల్‌గా మేం బాగా ఆడాము.’’ మసూద్ అన్నారు.

మేము గెలవాల్సిన మ్యాచ్ ఇది.. కానీ తడబడ్డాం.. - దక్షిణాఫ్రికా క్రికెట్ టీం కెప్టెన్ టెంబా బావుమా

ఇక జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. బ్యాటింగ్, బౌలింగ్ లో కూడా తప్పులు చేశామని మసూద్ అంగీకరించారు. ‘‘జింబాబ్వేపై మ్యాచ్ సందర్భంగా తప్పులు చేశాము. పవర్‌ప్లేలో మేము బాగా బౌలింగ్ చేయలేదు. అలాగే సరైన బ్యాటింగ్ కూడా చేయలేదు. కానీ షాదాబ్, నేను దానిని కవర్ చేసాము. ఆ తర్వాత కూడా మాకు 3 బంతుల్లో 3 పరుగులు మాత్రమే కావాలి ’’ అని ఆయన తెలిపారు. మకు వచ్చిన అన్ని పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటే తాము 4 మ్యాచుల్లో నాలుగింటిని గెలిచేవాళ్లమని షాన్ మసూద్ అన్నారు. తాము మరింత నిలకడగా ఆడాల్సిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

click me!