మళ్లీ కథ మొదటికి...పాండ్యా, రాహుల్ లకు చిక్కులు

By ramya NFirst Published Feb 6, 2019, 12:49 PM IST
Highlights

ఇటీవల పాపులర్ టీవీ షో.. కాఫీ విత్ కరణ్ లో అనుచిత వ్యాఖ్యలు చేసి ఈ ఇద్దరు క్రికెటర్లు ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ షోకి సంబంధించిన వివాదం ఈ క్రికెటర్లను ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు.

టీం ఇండియా యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కే ఎల్ రాహుల్ ల కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఇటీవల పాపులర్ టీవీ షో.. కాఫీ విత్ కరణ్ లో అనుచిత వ్యాఖ్యలు చేసి ఈ ఇద్దరు క్రికెటర్లు ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఆ షోకి సంబంధించిన వివాదం ఈ క్రికెటర్లను ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు.

పాండ్యా, రాహుల్, షో నిర్వాహకుడు కరణ్ లపై తాజాగా కేసు నమోదైంది. రాజస్థాన్ కి చెందిన డీఆర్ మెఘవాల్ అనే వ్యక్తి జోద్ పూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

పాండ్యా, రాహుల్‌ల వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో నిరవధిక నిషేధం విధిస్తూ బీసీసీఐ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ఇద్దరి ఆటగాళ్లను ఆస్ట్రేలియా పర్యటన నుంచి అకస్మాత్తుగా స్వదేశానికి పిలిపించింది. తొలుత క్రికెట్‌ పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్‌ వినోద్‌ రాయ్‌ రెండు మ్యాచ్‌ల నిషేధంతో సరిపెట్టాలని భావించినా, మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ న్యాయ సలహాకు పట్టుబట్టడంతో వీరిద్దరిపై నిరవధిక నిషేధాన్ని విధించారు.

కొన్ని రోజుల నాటకీయ పరిణామాల అనంతరం పాండ్యా, రాహుల్‌లపై సీఓఏ నిషేధాన్ని ఎత్తివేసింది. అనంతరం పాండ్యా న్యూజిలాండ్‌ పర్యటనలో పాల్గొని చెలరేగగా.. రాహుల్‌ భారత్‌-ఏ జట్టు తరపున ఇంగ్లండ్‌ బ్లూ జట్టుతో ఆడుతున్నాడు. కాగా.. అంతా అయిపోయింది.. వివాదం సద్దుమణిగింది అనుకున్న సమయంలో.. ఇలా ఈ యువ క్రికెటర్లపై కేసు నమోదుకావడం తీవ్ర చర్చనీయాంశమైంది. 

click me!