అథర్వ తైదే : ఐపీఎల్ తాజా సంచలనం.. 33 బాల్స్ లో 66 రన్స్.. ఇంతకీ అతనెవరంటే...

By SumaBala BukkaFirst Published Apr 29, 2023, 9:22 AM IST
Highlights

ఐపీఎల్‌లో లక్నో సూపర్‌జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మరో సంచలనం చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓడిపోయినా గెలిచింది. కొండంత లక్ష్యం కనిపిస్తున్నా.. అధర్వ తైదే ఇన్నింగ్స్ ఆడిన తీరు అద్భుతమని చెప్పవచ్చు. 

ఐపీఎల్ లో ఓ సంచలన ఆటగాడు పుట్టుకొచ్చాడు. లక్నో సూపర్ జెంట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. ఈ మ్యాచ్లో అతని జట్టు ఓడినా.. తన ఆట తీరుతో అందరి మనసుల్ని గెలుచుకున్నాడు. ప్రత్యర్థి జట్టు కొండంత లక్ష్యాన్ని ఇచ్చినా.. కించిత్తు కూడా బెదరకుండా ఇన్నింగ్స్ ఆడాడు. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.  ఆ ఆటగాడే అథర్వ తైదే. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన 23 ఏళ్ల అథర్వ తైదే తొలి అర్ద సెంచరీ చేశాడు.

అథర్వ తైదే 33 బంతుల్లో 66 పరుగులు చేశాడు. 26 బంతుల్లోనే అర్థ సెంచరీ మార్కును సాధించాడు. 66 పరుగుల ఇన్నింగ్స్ లో  రెండు సిక్సర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. లక్నో సూపర్ జెంట్స్,  పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే.. పంజాబ్ కింగ్స్ 258 పరుగుల అత్యంత కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగింది. 19.5 ఓవర్లలో.. 21 పరుగులు చేసి.. ఆలవుట్ అయ్యింది.  దీంతో ప్రత్యర్థి జట్టైనా లక్నో సూపర్ జెయింట్స్ 56 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది.

Latest Videos

పంజాబ్ పోరాడినా.. కొండను కరిగించలే.. లక్నోకు భారీ విజయం

లక్నో సూపర్ జెయింట్స్ గెలిచినా అందరి దృష్టి మాత్రం అథర్వ తైదే మీదే ఉంది. అథర్వ తైదే గురించి  వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అథర్వ తైదే . మహారాష్ట్రలోని అకోలా ప్రాంత వాసి.  2018-19 సీజన్లో  విజయ్ హజారే ట్రోఫీ ద్వారా లిస్ట్ ఏ క్రికెట్లో విదర్భ తరఫున ఆడాడు.  అలా ఐపిఎల్ లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత రంజీ ట్రోఫీతో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ అడుగు పెట్టాడు. టి20 క్రికెట్లో..  2019 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా అడుగు పెట్టాడు.

అథర్వ తైదేను 2022లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్  కొనుగోలు చేసింది. ఇప్పటివరకు అథర్వ తైదే సాధించిన విజయాలు ఏంటంటే.. 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో 887 పరుగులు, 24 లిస్టు ఏ మ్యాచుల్లో  758 పరుగులు, వీటితో పాటు 8 వికెట్లు… 33 టీ20 మ్యాచ్ల్లో 774 పరుగులతో పాటు 10 వికెట్లు తీశాడు అథర్వ తైదే. 

Time and Taide wait for no man 😉 pic.twitter.com/OMsyXX67z3

— JioCinema (@JioCinema)
click me!