ఐపీఎల్.. ఒక్క బాల్ కి 13 పరుగులు

By ramya NFirst Published Apr 6, 2019, 11:59 AM IST
Highlights

కేవలం ఒక్క బాల్ కి 13పరుగులు తీసి వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రి రసెల్ విధ్వంసం సృష్టించాడు.  శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్ కత్తా నైట్ రైటర్స్ పోటీపడిన సంగతి తెలిసిందే.

కేవలం ఒక్క బాల్ కి 13పరుగులు తీసి వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రి రసెల్ విధ్వంసం సృష్టించాడు.  శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కోల్ కత్తా నైట్ రైటర్స్ పోటీపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ లో ఆండ్రి రసెల్ సిక్సర్ల సునామి సృష్టించాడు. 13 బంతుల్లోనే ఏకంగా 48 పరుగులు బాదేసి 5 బంతులు మిగిలుండగానే కోల్‌కతాను గెలిపించాడు.

రసెల్‌ బ్యాట్‌ ఝళిపించడానికి ముందు కోల్‌కతా 16 బంతుల్లో 53 పరుగులు చేయాల్సి ఉంది. మహ్మద్‌ సిరాజ్‌ వేసిన 17వ ఓవర్‌ మూడో బంతిని సిక్సర్‌ కొట్టి రసెల్‌ పరుగుల వేట మొదలుపెట్టాడు. అది నోబాల్‌ కావడంతో అంపైర్‌ సిరాజ్‌ను తప్పించి అతడి స్థానంలో వచ్చిన స్టాయినిస్‌కు బౌలింగ్‌ ఇచ్చాడు. సిరాజ్‌ నోబాల్‌ వేయడంతో స్టాయినిస్‌ బౌలింగ్‌లో రసెల్‌కు ఫ్రీహిట్‌ ఛాన్స్‌ వచ్చింది. దీన్ని కూడా రసెల్‌ సిక్సర్‌ బాదాడు. దీంతో ఒక్క బంతికే 13 పరుగులు వచ్చినట్లయింది.

click me!