విశాఖ వాసులకు గుడ్‌న్యూస్.. భారత్-విండీస్ వన్డేకు టికెట్ ధర తగ్గింపు

By sivanagaprasad kodatiFirst Published Oct 11, 2018, 10:35 AM IST
Highlights

విశాఖలోని క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. క్రికెట్ మ్యాచ్ చూడాలని అనుకున్నప్పటికీ.. టికెట్ ధర ఎక్కువగా ఉందని ఫీల్ అవుతున్నారా..? అయితే భారత్- వెస్టిండీస్ మధ్య జరిగే రెండో వన్డేను మీరు అతి తక్కువ ఖర్చుతో చూడొచ్చు. 

విశాఖలోని క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. క్రికెట్ మ్యాచ్ చూడాలని అనుకున్నప్పటికీ.. టికెట్ ధర ఎక్కువగా ఉందని ఫీల్ అవుతున్నారా..? అయితే భారత్- వెస్టిండీస్ మధ్య జరిగే రెండో వన్డేను మీరు అతి తక్కువ ఖర్చుతో చూడొచ్చు.

షెడ్యూల్ ప్రకారం  తొలుత ఈ మ్యాచ్‌ను ఇండోర్‌కు కేటాయించారు. అక్కడ కాంప్లిమెంటరీ పాస్‌ల వివాదం తలెత్తడంతో వేదికను విశాఖకు మార్చింది బీసీసీఐ. ఇక్కడ యూనిమోని ఇండియా నిబంధనల ప్రకారం టికెట్ల ధరలను తగ్గించారు..  

రూ.6,000 టికెట్‌ను రూ.4,000కు, రూ.3500ను రూ.2,500కు, రూ.2,500 టికెట్‌ను రూ.2,000కు విక్రయించనున్నట్లు సమాచారం. మిగతా టికెట్ల ధరలు రూ.1,800, రూ.1,200, రూ.750, రూ.500, రూ.250గా ఉంటాయి.

బీసీసీఐ కొత్త రాజ్యాంగ నిబంధనల ప్రకారం 90 శాతం టిక్కెట్లను విక్రయానికి ఉంచుతున్నారు. 3,500 కాంప్లిమెంటరీ పాస్‌లు ఉన్నాయి. వీటిని వేర్వేరు ప్రాంతాల్లో 10 కౌంటర్ల ద్వారా 6,000 టికెట్లు విక్రయించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రెండో వన్డే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ కృష్ణబాబు తెలిపారు.

‘‘కోహ్లీ తప్ప ఇంకెవ్వరూ లేరు’’

ఖలీల్ అహ్మద్ చేతికి ఆసియా కప్...రోహిత్ కు సూచించింది ఆయనే...

పంత్...ధోనిని కాపీ కొట్టకు

తాను క్రికెట్ కి డాన్ అన్న షోయబ్.. నెటిజన్ల ట్రోలింగ్

వెస్టిండిస్‌కు మరో ఎదురుదెబ్బ...వన్డే,టీ20 సీరిస్‌లకు గేల్ దూరం

కొంచెం బరువు తగ్గు.. జహీర్ ఖాన్ కి గంగూలీ రిక్వెస్ట్

10 రోజుల్లోనే భారత్ ఖాతాలో మరో ఆసియాకప్
 

click me!