ఖలీల్ అహ్మద్ చేతికి ఆసియా కప్...రోహిత్ కు సూచించింది ఆయనే...

By Arun Kumar PFirst Published Oct 9, 2018, 3:43 PM IST
Highlights

మహేంద్ర సింగ్ ధోని... భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు.  క్రికెటర్‌గా, కెప్టెన్ గా భారత జట్టుకు ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. ధోనీ ఎంత మంచి ఆటగాడో అంతకంటే మంచి వ్యక్తి అని చాలా సందర్భాల్లో సహచర ఆటగాళ్లు వెల్లడించారు. ముఖ్యంగా జట్టులోకి కొత్తగా చేరిన ఆటగాళ్లకు తన అనుభవాలను పంచుకుని వారి భవిష్యత్ కోసం ధోని సలహాలు ఇస్తుంటాడు.ఇలా ఆటగాళ్లను ప్రోత్సహించడంలో ధోనీని మించిన వారు లేరని అభిమానులు, మాజీ క్రికెటర్లు అనేకసార్లు ఆయనపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. 

ఇలా తాజాగా జరిగిన ఆసియాకప్ ఫైనల్ తర్వాత కూడా ధోనీ మరోసారి ఓ యువ ఆటగాడికి ప్రోత్సహించే ప్రయత్నం చేశాడట.ఈ విసయాన్ని స్వయంగా ఆ ఆటగాడే వెల్లడించాడు.

ఆసియా కప్  ఫైనల్లో బంగ్లాదేశ్ ను ఓడించిన టీంఇండియా విన్నర్ కప్ ను అందుకున్న కెప్టెన్ రోహిత్ వెంటనే దాన్ని ఆరంగేట్ర ఆటగాడు ఖలీల్ అహ్మద్ కు అందించాడు. దీంతో అతడు ఆనందానికి అవదులు లేకుండా పోయింది. అయితే ఇలా ట్రోపిని ఖలీల్ చేతికి ఇవ్వమని ధోనినే రోహిత్ శర్మకు సలహా ఇచ్చాడట. జట్టులో అందరికంటే చిన్నావాడు కాబట్టి అతడి చేతికి ట్రోపి ఇస్తే ఆనందంగా పీలవుతాడని చెప్పాడట. అంతే కాదు ఇది అతడికే కాదు యువ క్రికెటర్లకు ప్రోత్సాహకంగా ఉంటుందని రోహిత్ కు ధోని చేప్పాడట. దీంతో రోహిత్ అలాగే చేసి ధోని సూచనలు పాటించాడంటూ స్వయంగా ఖలీల్ అహ్మద్ వెల్లడించాడు. 

సంబంధిత వార్తలు

కోహ్లీకి ఎందుకు విశ్రాంతి ఇచ్చామంటే...: రవి శాస్త్రి

ఆసియా కఫ్ ఎఫెక్ట్ : విరాట్ కోహ్లీ అఫిషియల్ వెబ్ సైట్‌ హ్యాక్

ఆసియా కప్ భారత్ దే: మూడోసారీ బంగ్లాదేశ్ కు నిరాశే

రోహిత్ కు మొండిచేయి: గంగూలీ ఆగ్రహం

ఆటగాళ్ల దయనే, నాదేమీ లేదు: ఆసియా కప్ విజయంపై రోహిత్

వెస్టిండీస్ తో టెస్టు సిరీస్: రోహిత్ కు మళ్లీ చేయి, ధావన్ ఔట్
 
click me!