ఆసియా కప్ : రో'హిట్', బంగ్లాపై భారత్ ఘన విజయం

By Arun Kumar PFirst Published Sep 21, 2018, 5:11 PM IST
Highlights

దుభాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్‌లో రెండు సూపర్ విజయాలతో దూసుకుపోతున్న టీంఇండియా మరోపోరుకు సిద్దమైంది. ఇవాళ సూపర్ 4 లో భాగంగా  భారత జట్టు బంగ్లాతో తలపడుతోంది. ఇందుకోసం ఇరుజట్లు సిద్దమయ్యాయి. 

ఆసియా కప్ లో భాగంగా జరిగిన మ్యాచులో బంగ్లాదేశ్ పై భారత్ ఘన వియం సాధించింది. బంగ్లాదేశ్ తమ ముందు ఉంచిన 174 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ మొర్తాజా బౌలింగులో భారీ షాట్ కు వెళ్లి మిథున్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దాంతో భారత్ 170 పరుగుల వద్ద ముూడో వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 83 పరుగులతో, దినేష్ కార్తిక్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు.

ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచులో భారత్ 61 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ దూకుడుగా ఆడుతూ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షకీబ్ అలీ హసన్ కు ఎల్బీడబ్ల్యుగా దొరికిపోయాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ అర్థ సెంచరీ చేశాడు. అతను 63 బంతుల్లో 50 పరుగులు చేశాడు. భారత్ 106 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అంబటి రాయుడు 28 బంతుల్లో 13 పరుగులు చేసి రూబెల్ హొసేన్ బౌలింగులో అవుటయ్యాడు.

భారత బౌలర్ల దాటికి బంగ్లా జట్టు బ్యాట్ మెన్స్ బెంబేలెల్లిపోయారు. భారత పేస్, స్పిన్ బౌలింగ్ దెబ్బకు బంగ్లాదేశ్ జట్టు కేవలం 173 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత జట్టు 174 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది.

టీంఇండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 4, జస్ప్రీత్ సింగ్ బుమ్రా 3, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీసుకున్నారు. బంగ్లా ఆటగాడు మెహదీ హసన్ మీర్జా 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

బంగ్లాదేశ్ బ్యాట్ మెన్స్ మంచి భాగస్వామ్యం ఏర్పడుతున్న వేళ అనవసర షాట్లుకు పోయి మూల్యం చెల్లించుకున్నారు. బంగ్లా ఆటగాడు మోర్తజా పరుగుల వేగాన్ని పెంచే ప్రయత్నంలో తన వికెట్ కోల్పోయాడు. ఆ వెంటనే 42 పరుగులు చేసి ఇప్టపివరకు టాప్ స్కోరర్ గా నిలిచిన మెహిది హసన్ మీర్జా కూడా ఔటయ్యాడు. దీంతో బంగ్లా 179 పరుగుల వద్ద 9 వికెట్లు కోల్పోయింది.

కాస్త నిలకడగా ఆడుతూ మరో వికెట్ పడకుండా సెంచరీ సాధించిన బంగ్లాకు భువనేశ్వర్ షాకిచ్చాడు. ఆతడి బౌలింగలో మహ్మదుల్లా (25 పరుగులు) ఎల్బీగా ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లోనే జడేజా మరో వికెట్ పడగొట్టాడు. మొసద్దిక్ హుస్సెన్ జడేజా బౌలింగ్ లో కీపర్ ధోని క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. దీంతో జడేజా ఖాతాలోని నాలుగో వికెట్ చేరింది. ఈ స్థితిలో బంగ్లా 34.3 ఓవర్లలో 105 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది. 

భారత బౌలర్ల దాటికి బంగ్లా వికెట్లు టప టపా కుప్పకూలాయి. కేవలం 65 పరుగులకు బంగ్లా జట్టు కీలక ఐదు వికెట్లు కోల్పోయింది. ఐదో వికెట్ రూపంలో ముష్పికర్ రహీమ్  జడేజా బౌలింగ్ లో వెనుదిరిగాడు. కాస్త నిలకడగా ఆడుతున్న మష్పికర్ రహీమ్ (21 పరుగులు 45 బంతుల్లో)ను తన స్పిన్ బౌలింగ్ తో జడేజా బోల్తా కొట్టించాడు. 

ఆసియా కప్ లో భారత బౌలర్ల దాటికి బంగ్లా బ్యాట్ మెన్స్ పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. 60 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయి బంగ్లా కష్టాల్లో పడింది. మహ్మద్ మిథున్ (9 పరుగులు) జడేజా బౌలింగ్ ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో వికెట్ రూపంలో మిథున్ వెనుదిరగడంతో  అతడి స్థానంలో మహ్మదుల్లా క్రీజులోకి వచ్చాడు.

.టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీంఇండియా బౌలర్ల దాటికి ఆదిలోనే బంగ్లా జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. మొదట బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్( 7 పరుగులు 16 బంతుల్లో) ను భువనేశ్వర్ కుమార్ ఔట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లోనే మరో ఓపెనర్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ను బుమ్రా ఔట్ చేశాడు. ఇక జడేజా వేసిన 9వ ఓవర్లో  షకీబ్ అల్ హసన్( 17 పరుగులు 12 బంతుల్లో) ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ముష్పికర్ రహీమ్ (12 పరుగులు), మహ్మద్ మితున్ క్రీజులో వున్నారు. మొత్తంగా బంగ్లా 48 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 

అయితే టాస్ గెలిచిన  భారత జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్ మొదట బ్యాంటింగ్ చేయనుంది.  భారత జట్టులో ఓ మార్పు చోటుచేసుకుంది. పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా బౌలింగ్ చేస్తూ గాయపడిన హర్దిక్ పాండ్యా స్థానంలో రవీంద్ర జడేజా జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్ కూడా ఈ మ్యాచ్‌ లో ఇద్దరు ఆటగాళ్లను మార్చింది. తాజాగా ముష్ఫిక‌ర్ ర‌హీమ్‌, ముస్త‌ఫిజుర్ రెహ‌మాన్ టీమ్‌లోకి వ‌చ్చారు.  

పసికూన ఆప్ఘానిస్థాన్ చేతిలో ఓటమిపాలైన బంగ్లాదేశ్ ఎలాగైనా భారత్ పై గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూసింది. కానీ సాధ్యం కాలేదు.హాకాంగ్ తో కాస్త కష్టపడి గెలిచినా... పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీంఇండియా తన విశ్వరూపాన్ని చూపించింది. అటు బౌలింగ్ లోనే ఇటు బ్యాటింగ్ లోను భారత ఆటగాళ్లు రాణించి దాయాదిని మట్టికరిపించి భారీ విజయాన్ని నమోదుచేశారు. ఇలాంటి సమయంలో మంచి ఊపుమీదున్న భారత జట్టును ఓడించడం బంగ్లాకు కష్టమైన పనే.

సంబంధిత వార్తల వివరాలు

ఆసియా కప్ షెడ్యూల్...

ఆసియా కప్: పాకిస్తాన్ ను చితక్కొట్టిన ఇండియా

ఆసియా కప్ 2018 : హ్యాట్రిక్‌పై కన్నేసిన రోహిత్ సేన

ఆసియా కప్: భారీ తేడాతో బంగ్లా చేతిలో శ్రీలంక చిత్తు

ఆసియా కప్: అదరగొట్టిన అఫ్గాన్, బంగ్లా చిత్తు

ఆసియాకప్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ... మరో ఇద్దరు ఆటగాళ్లు టోర్నీకి దూరం

పాకిస్థాన్‌ మ్యాచ్‌లో గాయపడ్డ హర్దిక్ పాండ్యా... స్ట్రెచర్ పై గ్రౌండ్ బయటకు తరలింపు

భారత్, పాక్‌లలో ఎవరికి సపోర్ట్ చేస్తారన్న నెటిజన్.. ట్విట్టర్‌కు టాటా చెప్పిన సానియా

 

 


 

click me!