ఆసియా కప్: అదరగొట్టిన అఫ్గాన్, బంగ్లా చిత్తు

By pratap reddyFirst Published Sep 20, 2018, 9:51 PM IST
Highlights

ఆఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే రెండో ఓవర్‌లోనే ఆఫ్గాన్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అబు హైదర్ రోనీ వేసిన ఈ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి ఇషానుల్లా ఆ తర్వాతి బంతికి మిథున్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

దుబాయ్: రషీద్ ఖాన్ ఆల్ రౌండ్ ప్రదర్సనతో అఫ్గానిస్తాన్ బంగ్లాదేశ్ ను చిత్తు చేసింది. బంగ్లాదేశ్ పై 136 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంకను చిత్తు చేసిన బంగ్లాదేశ్ పసికూన అఫ్గానిస్తాన్ ముందు తలవంచింది.

ఆసియా కప్ లో భాగంగా జరిగిన మ్యాచులో అఫ్గానిస్తాన్ బౌలర్లు బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ ను వణికించారు. అఫ్గాన్ తన ముందు ఉంచిన 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఆ తర్వాత ఏ స్థితిలోనూ కోలుకోలేకపోయింది.

ఆసియా కప్ లో భాగంగా గురువారం జరిగిన మ్యాచులో పసికూన అఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్ ముందు గౌరవప్రదమైన టార్గెట్ నే ఉంచింది. చివరలో రషీద్ ఖాన్(57), గుల్బాదిన్ నైబ్(42) రెచ్చిపోవడంతోఆఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టపోయి 255 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలింగ్‌లో షకీబ్ 4, అబూ హైదర్ 2, రుబెల్ 1 వికెట్ తీశారు.

ఈ మ్యాచ్‌లో ఆఫ్గానిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే రెండో ఓవర్‌లోనే ఆఫ్గాన్‌కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అబు హైదర్ రోనీ వేసిన ఈ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి ఇషానుల్లా ఆ తర్వాతి బంతికి మిథున్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 

ఆ తర్వాత కొద్దిసేపటికే రహ్మత్ సా(10) హైదర్ వేసిన 6వ ఓవర్ ఐదో బంతికి క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. ఓపెనర్ షెహ్‌జాద్‌తో కలిసి షహీదీ కలిసి మూడో వికెట్‌కి 51 పరుగులు జోడించారు
 
షకీబ్ బౌలింగ్‌లో షెహ్‌జాద్(37) హైదర్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం షహీదీ దూకుడు పెంచి అర్థ సెంచరీ చేశాడు. కానీ, రుబెల్ వేసిన 20వ ఓవర్ మూడో బంతికి అతను లిటన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత షకీబ్ దెబ్బకి ఆఫ్గానిస్థాన్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. అయితే, చివరలో రషీద్ ఖాన్, నైబ్ అఫ్గాన్ ను ఆదుకున్నారు.

click me!