స్వింగ్‌తో ఒకరు.. స్పిన్‌తో మరోకరు: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకెళ్లిన బౌల్ట్, చాహల్

By Siva KodatiFirst Published Feb 4, 2019, 2:05 PM IST
Highlights

న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య ముగిసన ఐదే వన్డేల సిరీస్‌ ప్రధానంగా బౌలర్లదే హవా. ఇరు జట్లు చాలా అన్ని మ్యాచ్‌ల్లోనూ అలౌట్ అయ్యాయి. భారత్ తరపున చాహల్ తన స్పిన్ మాయాజాలంతో విజృంభించగా... కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ స్వింగ్ యాక్షన్‌తో టీమిండియాను ముప్పు తిప్పలు పెట్టాడు.

న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య ముగిసన ఐదే వన్డేల సిరీస్‌ ప్రధానంగా బౌలర్లదే హవా. ఇరు జట్లు చాలా అన్ని మ్యాచ్‌ల్లోనూ అలౌట్ అయ్యాయి. భారత్ తరపున చాహల్ తన స్పిన్ మాయాజాలంతో విజృంభించగా... కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ స్వింగ్ యాక్షన్‌తో టీమిండియాను ముప్పు తిప్పలు పెట్టాడు.

ఈ క్రమంలో వీరిద్దరూ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకారు. ముఖ్యంగా హామిల్టన్‌లో భారత నడ్డి విరిచి ఆ మ్యాచ్‌లో జట్టును గెలిపించిన బౌల్ట్ ఏడు స్థానాలు ఎగబాకి 732 పాయింట్లతో బౌలర్ల జాబితాలో 3వ స్ధానంలో నిలిచాడు.

ఈ జాబితాలో భారత బౌలర్ బుమ్రా 808 పాయింట్లతో మొదటి స్థానంలోనూ, ఆఫ్గనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండవ స్ధానంలో ఉన్నారు. ఇక భారత్ సిరీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన లెగ్  స్పిన్నర్ యజువేంద్ర చాహల్ 709 పాయింట్లతో ఒక స్థానం ఎగబాకి 5వ స్థానంలో నిలిచాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌తో పాటు తాజా న్యూజిలాండ్ సిరీస్‌ను పరిగణనలోనికి తీసుకున్న ఐసీసీ చాహల్‌కు ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఇక వన్డే బ్యాట్స్‌మెన్ల జాబితాలో ఆస్ట్రేలియాలో మూడు అర్థసెంచరీలు సాధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికైన టీమిండియా మాజీ సారథి ధోనీ మూడు స్ధానాలు ఎగబాకి 17వ స్థానంలో నిలిచాడు.

కేదార్ జాదవ్ 8 స్థానాలు ఎగబాకి 35వ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 887 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండవ స్ధానంలో న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ మూడు, ఇంగ్లాండ్ క్రికెటర్ జోరూట్ నాలుగు, పాక్ యువ ఆటగాడు బాబర్ ఆజమ్ ఐదవ స్ధానాల్లో నిలిచారు.

ధోనీ కీపింగ్‌లో ఉంటే.. క్రీజు వదలి ఆడొద్దు: ఆటగాళ్లకు ఐసీసీ హెచ్చరిక

తొలుత బ్యాటింగ్: అసలు విషయం చెప్పిన రోహిత్ శర్మ

కోహ్లీ స్థానం తనకివ్వాలని కోరుతున్నచాహల్

టీంఇండియా నోట పాపులర్ సినిమా డైలాగ్.. బీసీసీఐ ట్వీట్

ఒంటరినై పోయాను: భార్యను ఉద్దేశిస్తూ రోహిత్ సంచలన వ్యాఖ్యలు

స్పిన్నర్ కేదార్ జాదవ్ కు షాకిచ్చిన ధోనీ

తప్పిదం: పరుగు కోల్పోయిన హార్దిక్ పాండ్యా

భారత బ్యాట్స్‌మెన్ ఎందుకు విఫలమవుతున్నారంటే..!!

 

click me!