తొలుత బ్యాటింగ్: అసలు విషయం చెప్పిన రోహిత్ శర్మ

By pratap reddyFirst Published Feb 4, 2019, 1:21 PM IST
Highlights

ఆ పిచ్‌ ముందుగా పేసర్లకు అనుకూలిస్తుందని తెలిసినా, టాస్‌ గెలిచిన తర్వాత ప్రయోగాత్మకంగా ముందుగా బ్యాటింగ్‌కు చేయడానికి మొగ్గుచూపినట్లు రోహిత్ శర్మ తెలిపాడు. టాస్‌కు ముందు పిచ్‌ను పరిశీలించానని, అక్కడున్న తేమ తొలుత పేసర్లకు సహకరిస్తుందని ముందే తెలుసునని అన్నాడు. 

వెల్లింగ్టన్‌: టాస్ గెలిచి కూడా న్యూజిలాండ్ తో జరిగిన చివరి ఐదో వన్డేలో బ్యాటింగ్ ఎంచుకోవడంలోని వ్యూహాన్ని భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. వచ్చే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకునే కఠిన పిచ్‌లపై ఆడాలని భావించినట్లు అతను చెప్పాడు. అందుకే న్యూజిలాండ్‌తో చివరి వన్డేలో తొలుత బ్యాటింగ్‌ తీసుకున్నట్లు తెలిపాడు. 

ఆ పిచ్‌ ముందుగా పేసర్లకు అనుకూలిస్తుందని తెలిసినా, టాస్‌ గెలిచిన తర్వాత ప్రయోగాత్మకంగా ముందుగా బ్యాటింగ్‌కు చేయడానికి మొగ్గుచూపినట్లు రోహిత్ శర్మ తెలిపాడు. టాస్‌కు ముందు పిచ్‌ను పరిశీలించానని, అక్కడున్న తేమ తొలుత పేసర్లకు సహకరిస్తుందని ముందే తెలుసునని అన్నాడు. 

ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో కఠిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటిని ఎలా ఎదుర్కోవాలో ఇక్కడ చూడాలని భావించామని రోహిత్ శర్మ అన్నాడు. తాము త్వరగా నాలుగు వికెట్లు చేజార్చుకున్న మాట నిజమేనని కూడా అన్నాడు. పరిస్థితులు బాగాలేనప్పుడు, బంతి స్వింగ్‌ అవుతున్నప్పుడు ఎలా బ్యాటింగ్‌ చేయాలో నేర్చుకోవడానికి ఇది ఉపయోపగడిందని చెప్పాడు. 

ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఆడాలన్నది అనుభవ పూర‍్వకంగా తాము తెలుసుకున్నామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో 30 ఓవర్ల వరకూ రన్‌రేట్‌ బాగా లేకపోయినప్పటికీ, 250 స్కోరును అందుకోవడం సానుకూల అంశమని అన్నాడు.

click me!