గ్రౌండ్‌లోనే కాదు... కోర్టులోనూ పాక్‌పై మనదే గెలుపు

By sivanagaprasad kodatiFirst Published Nov 21, 2018, 10:26 AM IST
Highlights

క్రికెట్ గ్రౌండ్‌లోనే కాదు కోర్టుల్లోనూ పాక్‌పై తనదే గెలుపని భారత్ నిరూపించింది. తమతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడతానని చెప్పి బీసీసీఐ మాట తప్పిందని.. అందువల్ల తాము చాలా నష్టపోయామని ఇందుకు గాను... రూ.447 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) డిమాండ్ చేసింది

క్రికెట్ గ్రౌండ్‌లోనే కాదు కోర్టుల్లోనూ పాక్‌పై తనదే గెలుపని భారత్ నిరూపించింది. తమతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడతానని చెప్పి బీసీసీఐ మాట తప్పిందని.. అందువల్ల తాము చాలా నష్టపోయామని ఇందుకు గాను... రూ.447 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) డిమాండ్ చేసింది..

దీనిపై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలిని (ఐసీసీ)ని ఆశ్రయించింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ఐసీసీ వివాదాల పరిష్కార కమిటీ (డీఆర్‌సీ) పాక్ డిమాండ్‌ను తిరస్కరించింది. భారత్, పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణకు సంబంధించి 2014 ఏప్రిల్‌లో ఒక ఒప్పందం జరిగింది.

అప్పట్లో ‘‘బిగ్ త్రీ’’ ఫార్ములాకు అనుకూలంగా పాక్ ఓటేయడంతో అందుకు ఉపకారంగా ఈ సిరీస్‌లు ఆడేందుకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం ఇరు జట్ల మధ్య 2015-2023 మధ్య ఆరు సిరీస్‌లు జరగాల్సి ఉంది.

అయితే సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్-పాక్‌ల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి. దీని ప్రభావం క్రికెట్‌పైనా పడింది.. పాక్‌తో సిరీస్‌లు ఆడేందుకు భారత ప్రభుత్వం అనుమతిస్తే తప్ప తాము మ్యాచ్‌లు ఆడలేమని బీసీసీఐ తేల్చి చెప్పింది.

అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం 2014, 2015లలో జరగాల్సిన సిరీస్‌లు జరగలేదు. దీని వల్ల తాము భారీగా నష్టపోయామని.. కాబట్టి పరిహారంగా 63 కోట్ల డాలర్లు వడ్డీ, ఖర్చులతో సహా బీసీసీఐ తమకు చెల్లించాలని పీసీబీ నోటీసులు పంపింది.

ఈ వివాదం ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అనుకున్నప్పటికీ కుదరలేదు.. దీంతో పాక్ ఐసీసీ గడప తొక్కింది.. ఈ ఏడాది అక్టోబర్‌లో ఐసీసీ వివాద పరిష్కారాల కమిటీ‌ జరిగిన వాదనల్లో బీసీసీఐ తరపున సల్మాణ్ ఖుర్షీద్, శశాంక్ మనోహర్ తదితర లాయర్లు హాజరయ్యారు.

ఎంఓయూ అనేది కేవలం ఆడేందుకు ఆసక్తి కనబరిచిన పత్రమేనని.. దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని... పైగా ప్రభుత్వ అనుమతి లేకుండా తాము ఏం చేయలేమని కూడా బీసీసీఐ కమిటీసిక స్పష్టం చేసింది..

ఈ వాదనతో ఏకీభవించిన డీఆర్ఎసీ పాక్ అభ్యర్థనను తిరస్కరించింది.. అలాగే పాక్ క్రికెట్ బోర్డు ఈ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని... అప్పీల్‌కు కూడా వెళ్లరాదని ఆదేశించింది. మరోవైపు ఓడిపోయిన పాక్ బాధను మరింత పెంచే విధంగా ‘‘న్యాయపరమైన ఖర్చులు’’ చెల్లించాల్సిందిగా పీసీబీ చెల్లించాలంటూ డీఆర్‌సీని ఆశ్రయిస్తామని బీసీసీఐ ప్రకటించింది. 
 

మహిళల టీ20 ప్రపంచకప్: పాక్‌‌పై భారత్ ఘన విజయం

ధోనీ ఔట్: ఆస్ట్రేలియాతో తలపడే భారత జట్టు ఇదే..

విరాట్ కోహ్లీపై బిషన్ సింగ్ విమర్శలు

ప్రపంచానికి తెలియని ద్రవిడ్ రికార్డును ప్రకటించిన బీసీసీఐ

‘‘కశ్మీర్ పాకిస్తాన్‌‌దే’’...మాట మార్చిన అఫ్రిది

రోహిత్‌,కోహ్లీలను వెనక్కినెట్టిన మిథాలీ...ఇప్పుడు గప్టిల్ ను కూడా...

మళ్లీ చిక్కుల్లో మొహమ్మద్ షమీ... అరెస్ట్ వారెంట్ తప్పదా..?

ఆసిస్ బౌలర్ కి అరుదైన జబ్బు.. ఆటకు గుడ్ బై

200 ఫోర్లు కొట్టిన వీరుడిగా రోహిత్ శర్మ

click me!