పారాలింపిక్స్‌లో మరో పతకం... రజతం నెగ్గిన ఐఏఎస్ ఆఫీసర్ సుహాస్ యతిరాజ్‌...

By Chinthakindhi RamuFirst Published Sep 5, 2021, 8:38 AM IST
Highlights

వరల్డ్‌ నెం.1 షట్లర్‌తో జరిగిన ఫైనల్‌లో హోరాహోరీగా పోరాడి ఓడిన సుహాస్ యతిరాజ్... టోక్యో పారాలింపిక్స్‌లో పతకం నెగ్గిన తొలి ఐఏఎస్ ఆఫీసర్‌గా రికార్డు...

టోక్యో పారాలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 18కి చేరింది. బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఎస్‌ఎల్4 ఫైనల్ చేరిన భారత ఐఏఎస్ ఆఫీసర్ సుహాస్ యతిరాజ్ రజతంతో సరిపెట్టుకున్నాడు. వరల్డ్ నెం.1 ప్లేయర్, ఫ్రాన్స్‌కి చెందిన లూకస్ మజుర్‌తో హోరాహోరాగా జరిగిన ఫైనల్‌లో సుహాస్ 15-21, 21-17, 21-15 తేడాతో పోరాడి ఓడాడు...

A fantastic confluence of service and sports! Suhas Yathiraj has captured the imagination of our entire nation thanks to his exceptional sporting performance. Congratulations to him on winning the Silver medal in Badminton. Best wishes to him for his future endeavours. pic.twitter.com/bFM9707VhZ

— Narendra Modi (@narendramodi)

తొలి సెట్ గెలిచి, వరల్డ్ నెం.1 ప్లేయర్‌కి షాక్ ఇచ్చిన సుహాస్ యతిరాజ్, మ్యాచ్ ఆద్యంతం మంచి పోరాటం కనబరిచాడు... పారాలింపిక్స్‌లో పతకం నెగ్గిన మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు సుహాస్ యతిరాజ్. 

Congratulations to Suhas Yathiraj who gave a tough fight to world #1 and won silver medal in badminton at . Your dedication in pursuing sports while discharging duties as a civil servant is exceptional. Best wishes for a future full of accomplishments.

— President of India (@rashtrapatibhvn)

What. A. Match 🤯's Lucas Mazur and 's Suhas Yathiraj served up a true classic in the Men's Singles SL4 Final. 🔥 pic.twitter.com/jUjC8QqboA

— #Tokyo2020 for India (@Tokyo2020hi)

పారాలింపిక్స్‌లో అద్భుత పోరాటం కనబర్చిన సుహాస్ యతిరాజ్‌కి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు. సుహాస్ పతకంతో భారత్ ఖాతాతో 4 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలు చేరాయి. పతకాల పట్టికలో 27వ స్థానంలో ఉంది టీమిండియా.

click me!