ఐసీసీ బంపర్ ఆఫర్... సబ్సీడీకి చల్లచల్లని బీర్

By ramya NFirst Published Apr 10, 2019, 10:58 AM IST
Highlights

ఉత్కంఠ రేకెత్తించే క్రికెట్ మ్యాచ్ ని లైవ్ లో చూస్తూ.. చల్లని బీర్ ఆస్వాదిస్తూ ఉంటే.. ఆ మజాయే వేరు కదా. కానీ.. క్రికెట్ స్టేడియంలో బీర్ కొనాలంటే తడిచి మోపిడౌతుంది. 

ఉత్కంఠ రేకెత్తించే క్రికెట్ మ్యాచ్ ని లైవ్ లో చూస్తూ.. చల్లని బీర్ ఆస్వాదిస్తూ ఉంటే.. ఆ మజాయే వేరు కదా. కానీ.. క్రికెట్ స్టేడియంలో బీర్ కొనాలంటే తడిచి మోపిడౌతుంది. అందుకే బాగా డబ్బుఉన్నవారు తప్ప.. మిగిలినవారు వాటి జోలికి పోరు. అలాంటి వారి కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) బంపర్ ఆఫర్ ప్రకటించింది.

టోర్నీ నిర్వాహక దేశం ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ)తో కలిసి బీరు ధరను కిందకు దించింది. అదేమీ చర్చలతో కాదు... మీరు కోల్పోయే మొత్తాన్ని మేం చెల్లిస్తాం కానీ తక్కువ ధరకే స్టేడియాల్లో బీర్లు అందించండని సదరు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

త్వరలో వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా  వరల్డ్‌ కప్‌ అధికారిక బీర్‌ స్పాన్సర్‌గా భారత్‌కు చెందిన ‘బీరా 91’ కంపెనీతో ఐసీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ కప్‌ మ్యాచ్‌లు జరిగే 11 వేదికల్లో ఇదే బీరును అమ్మాలి. నిర్వాహకులు ఒక బీరు పింట్‌ (గ్లాసు) ధరను 9.70 డాలర్లు (సుమారు రూ. 670)గా నిర్ణయించారు. 

అయితే అక్కడి వ్యాపారులు మాత్రం ఇది తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదని, కనీసం 15.5 డాలర్లు (సుమారు రూ.1000) ఉంటే గాని కుదరదని తేల్చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చే అభిమానులు బీరు ధర చూసి బెంబేలెత్తకుండా ఉండేందుకు ఐసీసీ ఓ ఉపాయం ఆలోచించింది.

ఫ్యాన్స్‌కు తక్కువ రేటుకే ఇవ్వండి, మిగిలిన నష్టాన్ని మేం పూరిస్తాం అని ఐసీసీ హామీ ఇచ్చింది. దీని ప్రకారం మొత్తం దాదాపు 5 లక్షల పౌండ్ల (రూ. 4 కోట్ల 52 లక్షలు) సబ్సిడీ భారం పడనుంది. దీనిని ఐసీసీ, ఇంగ్లండ్‌ బోర్డు సమంగా భరిస్తాయి. 

click me!