ఒలింపిక్స్ లో కొనసాగుతున్న కరోనా కలవరం: ముగ్గురు అథ్లెట్లకు పాజిటివ్

By team teluguFirst Published Jul 18, 2021, 11:08 AM IST
Highlights

2020 టోక్యో ఒలింపిక్స్‌కు సర్వం సిద్ధమవుతోండగా... ఒలింపిక్‌ గ్రామంలోకి అథ్లెట్లు అడుగుపెడుతున్న వేళ ఇదే క్రమంలో అథ్లెట్లతో పాటు కోవిడ్‌-19 వైరస్‌ కూడా ఒలింపిక్‌ గ్రామంలోకి వచ్చేయడం ఆందోళన కలిగిస్తుంది. 

ఒలింపిక్ గ్రామంలో కరోనా కేసుల కలకలం కొనసాగుతూనే ఉంది. ఒలింపిక్ విలేజ్ లో బస చేస్తున్న ఇద్దరు అథ్లెట్లు సహా మొత్తంగా ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్టు నిర్వహణ కమిటీ ఆదివారం నాడు ప్రకటించింది. ఆ ముగ్గురు అథ్లెట్లు ఎవరు అనే విషయం పై స్పష్టత ఇవ్వకున్నప్పటికీ... ఇద్దరు ఒలింపిక్ విలేజ్ లో ఉండగా మరొకరు ఒలింపిక్స్ క్రీడాకారుల కోసం కేటాయించిన హోటల్ లో ఉన్నట్టు తెలిపారు. 

మొత్తంగా ఆదివారం నాడే ఒక జర్నలిస్టు, కాంట్రాక్టర్ సహా 10 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. ఇప్పటివరకు మొత్తంగా ఒలింపిక్ సంబంధించి 55 కేసులు నమోదయ్యాయి. నిన్న నాన్ అథ్లెట్ కరోనా వైరస్ బారిన పద విషయం తెలిసిందే. అతడిని గేమ్స్ విలేజ్ నుండి దూరంగా ఇసోలాటిన్ లో ఉంచారు. 

2020 టోక్యో ఒలింపిక్స్‌కు సర్వం సిద్ధమవుతోండగా... ఒలింపిక్‌ గ్రామంలోకి అథ్లెట్లు అడుగుపెడుతున్న వేళ ఇదే క్రమంలో అథ్లెట్లతో పాటు కోవిడ్‌-19 వైరస్‌ కూడా ఒలింపిక్‌ గ్రామంలోకి వచ్చేయడం ఆందోళన కలిగిస్తుంది. 

'ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదు కావటాన్ని ఊహించవచ్చు. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి అథ్లెట్‌ కాదు. జపాన్‌ దేశస్థుడూ కాదు. క్రీడల నిర్వహణ బృందానికి సంబంధించిన వ్యక్తి' అని టోక్యో నిర్వహణ కమిటీ సీఈవో తొషిరో ముటో నిన్న పాజిటివ్ వచ్చిన అథ్లెట్ గురించి తెలిపారు.

ఇక భారత్ నుండి ఒలింపిక్స్ కి బయల్దేరిన బృందాలు టోక్యో చేరుకుంటున్నాయి. ఇప్పటికే సెయిలింగ్ టీం చేరుకోగా... మిగిలిన టీమ్స్ నేడు చేరుకున్నాయి. నిన్న రాత్రి ఢిల్లీ నుండి స్పెషల్ ఫ్లైట్ లో వారు టోక్యో చేరుకున్నారు. 

భారత్ నుండి ఈసారి ఒలింపిక్స్ కి జంబో బృందం బయల్దేరి వెళ్లిన విషయం తెలిసిందే. ఎన్నో ఈవెంట్లలో ప్రపంచ నెంబర్ 1, నెంబర్ 2 ర్యంకుల్లోని భారతీయులు ఈ క్రీడల్లో పోటీ పడుతున్నారు. అంతే కాకుండా మరెన్నో ఆటల్లో హాట్ ఫేవరెట్లు గా బరిలోకి దిగుతున్నారు. భారతీయులంతా ముక్తకంఠంతో భారత అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

click me!