అడిలైడ్ టెస్ట్: మూడో రోజు భారత్‌దే పైచేయి...166 పరుగుల ఆధిక్యం

By Arun Kumar PFirst Published Dec 8, 2018, 11:29 AM IST
Highlights

నాలుగు టెస్టుల సిరిస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత్ కాస్త పైచేయి సాధిస్తోంది. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్ కొద్ది పరుగుల ఆధిక్యం సాధించిన భారత్ రెండో ఇన్సింగ్స్ లో కూడా మంచి ఆటతీరు కనబరుస్తోంది.  

భారత్, ఆస్ట్రేలియాల మధ్య అడిలైడ్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో మూడోరోజు కూడా భారత్ ఆధిపత్యం కొనసాగింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్ లో 166 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ప్రస్తుతం క్రీజులో చటేశ్వర్ పుజారా (40 పరుగులు, 127 బంతుల్లో), అంజిక్యా రహానే ( 1 పరుగులు, 15 బంతుల్లో)లు ఉన్నారు. మరళీ విజయం 18, లోకేష్ రాహుల్ 44 , కోహ్లీ 34 పరుగులు చేసి ఔటయ్యారు. మొత్తానికి ఆట ముగిసే సమయానికి భారత జట్టు  3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. 

నాలుగు టెస్టుల సిరిస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మొదటి టెస్ట్ లో భారత్ కాస్త పైచేయి సాధిస్తోంది. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్ కొద్ది పరుగుల ఆధిక్యం సాధించిన భారత్ రెండో ఇన్సింగ్స్ లో కూడా మంచి ఆటతీరు కనబరుస్తోంది.

టీంఇండియా ఓపెనర్లలో మురళీ విజయ్ (18 పరుగులు 53 బంతుల్లో) ఆదిలోనే ఔటైనా మరోవైపు లోకేష్ రాహుల్ ఆచి తూచి ఆడుతూ ఇన్నింగ్స్ ను నిలబెట్టడానికి ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలోనే లోకేష్ ( 44 పరుగులు 67 బంతుల్లో) ఔటవడంతో భారత్ రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 

ప్రస్తుతం క్రీజులో మొదటి ఇన్నింగ్స్ సెంచరీ వీరుడు చటేశ్వర్ పుజారా ( 9 పరుగులు 32 బంతుల్లో),  కెప్టెన్ విరాట్ కోహ్లీ ( 2 పరుగులు  9 బంతుల్లో) ఉన్నారు. వీరు జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా చూస్తున్నారు. 

అడిలైడ్ టెస్టులో మొదటి  ఇన్నింగ్స్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 250 పరుగులు స్వల్ఫ స్కోరుకే ఆలౌటయ్యింది. అయితే భారత బౌలర్ల విజృంభనతో ఆసిస్ కూడా కేవలం 235 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ మరింత రసవత్తరంగా మారింది. 
 
మొదటి ఇన్నింగ్స్ లో భారత్ ఆదిక్యం తక్కువే అయినా ఆ పరుగులే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి, ఇదే పోరాటస్పూర్తిని సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చూపించి జట్టుకు మంచి విజయం అందించాలని భారత ఆటగాళ్లు ప్రయత్నిస్తున్నారు. తద్వారా నాలుగు టెస్ట్ ల సీరిస్ లో శుభారంభ చేసి ఆసీస్ ను ఆత్మవిశ్వాసంపపై దెబ్బకొట్టాలని భారత్ భావిస్తోంది.  

మరిన్ని వార్తలు

అడిలైడ్ టెస్ట్: ట్రేవిస్ ఒంటరిపోరు, ఆసీస్ 191/7

అడిలైడ్ టెస్ట్: 250 పరుగులకు భారత్ అలౌట్, ఆసీస్ 35/1

ఆస్ట్రేలియాతో తొలి టెస్టు.. పుజారా ఖాతాలో రెండు అరుదైన రికార్డులు

అడిలైడ్ టెస్ట్: పుజారా ఒంటరి పోరు, తొలి రోజు భారత్ 250/9

వికెట్ పారేసుకున్న రోహిత్... మాజీలు, అభిమానుల ఆగ్రహం

 

click me!