అందరూ నన్నే టార్గెట్ చేస్తారు... మిథాలీ రాజ్ ఫైర్

By telugu teamFirst Published May 10, 2019, 9:36 AM IST
Highlights

మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్... ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. అందరూ తననే టార్గెట్ చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీ 20 మ్యాచ్ లలో తన ఆటతీరుపై విమర్శలు గుప్పించేవారు మిగతా క్రీడాకారిణులు ఎలా ఆడుతున్నారనే విషయం మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు.

మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్... ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. అందరూ తననే టార్గెట్ చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీ 20 మ్యాచ్ లలో తన ఆటతీరుపై విమర్శలు గుప్పించేవారు మిగతా క్రీడాకారిణులు ఎలా ఆడుతున్నారనే విషయం మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు.ప్రస్తుతం ఐపీఎల్‌లో భాగంగా మహిళల టీ20 చాలెంజ్‌ సిరీ్‌సలో ఆడుతున్న మిథాలీ గురువారం ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై కాస్త ఘాటుగానే బదులిచ్చింది.

‘మహిళల టీ20 చాలెంజ్‌ తొలి మ్యాచ్‌లో ఆడిన ప్లేయర్లలో 100లోపు స్ట్రయిక్‌రేట్‌తో చాలామంది ఉన్నారు. కానీ, దీన్ని ఎవరైనా గమనించారా? లేదు.. ఎందుకంటే వాళ్లలో మిథాలీ లేదు కదా!’ అని వ్యాఖ్యానించింది. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీ్‌సలో ఓ టాపార్డర్‌ ప్లేయర్‌ ప్రదర్శనపై స్పందిస్తూ.. ముంబై యువ క్రికెటర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ పేరును పరోక్షంగా ప్రస్తావించింది. 

ఇంగ్లండ్‌తో జరిగిన ఆ టీ20 మ్యాచ్‌లో ఓడిన భారత జట్టులో టాపార్డర్‌లో బరిలోకి దిగిన రోడ్రిగ్స్‌ 22 బంతులాడి 11 పరుగులే చేసింది. ‘చివరిగా ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ఓ టాపార్డర్‌ బ్యాట్స్‌వుమన్‌ 50 స్ట్రయిక్‌రేట్‌తో ఆడింది. దీన్ని నేనేమైనా ప్రశ్నించానా? ఈ అంశాన్ని ఎవరైనా లేవనెత్తారా? కానీ, ప్రజలు మా త్రం ఇప్పటికీ నా స్ట్రయిక్‌రేట్‌ గురించి మాట్లాడుతూనే ఉంటారు. నేను నాలుగు డాట్‌బాల్స్‌ ఆడగానే అంతా ట్రోల్‌ చేశారు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

తానేమీ బెస్ట్ ఫ్లేయర్ నని చెప్పడం లేదని... కాకపోతే... అన్ని సార్లు అధ్భుతంగా ఆడలేమన్న విషయం గుర్తించాలని... తనపై విమర్శలు చేయడం తగ్గించాలని ఆమె కోరారు.
 

click me!