కరువు బారిన 245 మండలాలు

First Published Oct 22, 2016, 2:13 AM IST
Highlights
  • ప్రభుత్వం 245 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది
  • ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్ధితులే ఇందుకు కారణం

తీవ్ర వర్షభావ పరిస్ధితుల కారణంగా భారీగా పంటల నష్టం వాటిల్లిన కారణంగా ప్రభుత్వం రాష్ట్రంలోని 245 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కాడా జారీ అయింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ మండలాలున్నాయి. జూన్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకూ ఖరీఫ్ సీజన్ ను కరువు పరిస్దితులు నెలకొన్నట్లు విపత్తు నివారణ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ప్రభుత్వం ప్రకటించిన కరువు 245 మండలాల్లో 184 మండలాలు రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోనే ఉండటం గమనార్హం. జిల్లాల వారీగా చూస్తే అనంతపురంలో 63, చిత్తూరులో 53, కర్నూలులో 36, వైఎస్ఆర్ లో 32తో పాటు ప్రకాశం జిల్లాలో 23, నెల్లూరులో 27, శ్రీకాకుళంలో 11 మండలాలను కరువు మండలాల జాబితాలో చేర్చరు.

click me!