అసెంబ్లీకి కొత్త భవనం

First Published Oct 21, 2016, 1:39 AM IST
Highlights
  • త్వరలో అసెంబ్లీ, కౌన్సిల్ కు కొత్త భవనాలు
  • త్వరలో శంకుస్ధాపన

ఎర్రమంజిల్ లో తెలంగాణాకు త్వరలో నూతన అసెంబ్లీ, శాసనమండలి భవనాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఖైరతాబాద్, పంజాగుట్ట దారిలోని చారిత్రాక ‘ఎర్రమంజిల్ ప్యాలెస్’ ప్రాంగణంలో వీటిని తాత్కాలికాం నిర్మించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు భావిస్తున్నారు.     ప్రస్తుతం అక్కడున్న నీటి పారుదల శాఖ కార్యాలయ భవనాలను కూలగొట్టి సదరు స్ధలంలో పై భవనాలను నిర్మించేందుకు దాదాపు నిర్ణయమైంది.

   సిఎం ఆదేశాల మేరకు రోడ్లు, భవనాల శాఖ ఈ మేరకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం నాంపల్లిలోని శాసనసభ, శాసనమండలి భవనాలు పాతవైపోవటంతో పాటు ప్రస్తుత అవసరాలకు ఏమాత్రం సరిపోవటం లేదన్న ప్రచారం ఎప్పటి నుండో వినిపిస్తోంది. దాంతో ఇప్పటి అవసరాలతో పాటు భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని నూతన భవనాలను నిర్మించాలని కెసిఆర్ నిర్ణయించారు.

    ఇప్పటి వరకూ ఎర్రమంజిల్లో ఉన్న రోడ్లు, భవనాల శాఖ ఇఎన్సి కార్యాలయాన్ని నూతన భవన సముదాయంలోకి మార్చారు. దాంతో సదరు భవన సముదాయాన్ని కూల్చేస్తే దాదాపు 15 ఎకరాల స్ధలం అందుబాటులోకి వస్తుంది. ఎలాగూ 15 ఎకరాల స్ధలం అందుబాటులో ఉంది కాబట్టి అసెంబ్లీ, శాసనమండలికి నూతన సొబగులతో కొత్త భవనాలను నిర్మిస్తే సరిపోతుందని ముఖ్యమంత్రి అనుకున్నారు. ప్రస్తుత అసెంబ్లీ 8 ఎకరాల్లోనే ఉందన్న విషయాన్ని ఉన్నతాధికారులు సిఎం దృష్టికి తీసుకెళ్ళారు. కాబట్టి త్వరలో పై రెండు భవనాలకు శంకుస్ధాపన ఉంటుంది.    

 

click me!