ఎదిగే పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన, పోషకాహారం పెట్టాలి. అప్పుడే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పిల్లలకు ప్రతిరోజూ ఉదయం పరిగడుపున కొన్ని హెల్తీ ఫుడ్స్ ను పెట్టాలి. ఇవే పిల్లల్ని ఆరోగ్యంగా, ఎలాంటి వ్యాధులు లేకుండా ఉంచుతాయి. అవేంటంటే..
పెద్దలతో పాటుగా పిల్లలకు కూడా సంపూర్ణ, మంచి పోషకాహారం అవసరం. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉదయం లేవగానే బిస్కట్లను తినమని ఇస్తున్నారు. మైదాతో చేసే ఈ బిస్కట్లు టేస్టీగా ఉన్నా.. ఆరోగ్యాన్ని మాత్రం దెబ్బతీస్తాయి. అవును పొద్దు పొద్దున్నే ఆరోగ్యాన్ని పాడు చేసే బిస్కట్లను, చాక్లెట్లను పిల్లలు తింటే అనారోగ్యం బారిన పడతారు. అందులోనూ చాలా మంది పిల్లలు బ్రేక్ ఫాస్ట్ ను అస్సలు తినరు. కానీ ఇది మీ పిల్లలన్ని చెడు అలవాట్లకు దారితీస్తుంది. మీ పిల్లలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచాలనుకుంటే రోజూ ఉదయం పరిగడుపున ఏం పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బాదం: బాదం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాదం పప్పులు ఎదిగే పిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే దీనిలో ఐరన్, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పిల్లలు ఉదయం పూట బాదం పప్పులను తింటే వారి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే వారు ఆరోగ్యంగా ఉంటారు. బాదం పప్పులు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
undefined
అరటిపండు: పిల్లలకు రోజుకో అరటిపండును ఇస్తే వారు ఆరోగ్యంగా ఉంటారు. అరటిపండులో కార్బోహైడ్రేట్స్, ఐరన్, సోడియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. మీ పిల్లలు మరీ సన్నగా ఉంటే ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక అరటిపండును తినమని చెప్పండి. ఇది వారి బరువు పెరుగుతుంది. అంతేకాకుండా వాళ్ల ఎముకలను కూడా బలంగా చేస్తుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది.
ఉసిరికాయ: ఉసిరికాయ పోషకాల వనరు. దీనిలో కాల్షియం, ఐరన్,విటమిన్ సి, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని ప్రతిరోజూ పరగడుపున పిల్లలకు ఇస్తే వారి కంటిచూపు మెరుగుపడుతుంది. అలాగే వారి పొట్ట కూడా బాగుంటుంది.
యాపిల్స్: యాపిల్స్ లో ఐరన్, కాల్షియం, జింక్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో పిల్లలకు యాపిల్స్ ఇస్తే వారి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే వారి కళ్లు కూడా బాగా కనిపిస్తాయి.
గోరువెచ్చని నీరు: పెద్దవాళ్లే కాదు చిన్న పిల్లలు కూడా ఉదయం పళ్లు తోముకోవడానికంటే ముందే గోరువెచ్చని నీటిని తాగాలి. ఈ అలవాటు మీ పిల్లల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతుంది. ఉదయం పరిగడుపున వేడినీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా సీజనల్ వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది.