పిల్లలతో ఎలా మాట్లాడుతున్నారు?

By ramya Sridhar  |  First Published Jul 13, 2024, 3:43 PM IST

తల్లులు పిల్లలతో మాట్లాడే విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా.. పిల్లలలతో చాలా మృదువుగా మాట్లాడాలట.  నిపుణుల ప్రకారం.. తల్లి.. పిల్లలలతో ఎలా ఉండాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...


పిల్లల జీవితం బాగుండాలని పేరెంట్స్ కోరుకుంటారు. అయితే... పిల్లల పెంపకం విషయంలో తండ్రి కంటే.. తల్లి బాధ్యత కాస్త ఎక్కువ అనే చెప్పాలి.  అందుకే.. తల్లులు పిల్లలతో మాట్లాడే విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా.. పిల్లలలతో చాలా మృదువుగా మాట్లాడాలట.  నిపుణుల ప్రకారం.. తల్లి.. పిల్లలలతో ఎలా ఉండాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

పిల్లలు కోపంగా మాట్లాడితే కోపగించుకోవడం, ప్రేమగా మాట్లాడితే చాల్లే వేషాలు అని కొట్టేస్తారు చాలామంది అమ్మలు. కానీ అలా చేయకూడదట. అలాచేస్తే వాళ్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ పెరగదు. ఇకప్పుడు వాళ్లకీ మరబొమ్మలకీ తేడా ఏముంటుంది? వాటిని బయట పెట్టలేక డిప్రెషన్ లోకీ వెళ్లిపోతారు. అందుకే కోపం, బాధ, సంతోషం ఏదైనా మీతో పంచుకుంటోంటే జాగ్రత్తగా వినండి. 

Latest Videos

బాగా చదవట్లేదు, మార్కులు రావట్లేదు అని ఎప్పుడూ తిట్టొద్దు. అలా చేస్తే వారిలో క్రియోటివిటీ  పోతుంది. రైటింగ్ బాగుందని టీచర్ మెచ్చుకున్నా, చిన్న ప్రశ్నకే ఉత్సాహంగా చెప్పినా మెచ్చుకోండి. కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. వాళ్ల క్రియేటివిటీని బయటపెడతారు.

అత్తగారి మీద కోపంతో, బామ్మలది చాదస్తం అంటూ కొట్టిపారేస్తూ పిల్లలను వారికి దూరం చేయొద్దు. జాలి, దయ వంటివాటికి దూరం చేసినట్టే. ఆ పిల్లలతో మాట్లాడొద్దు, వీరితో స్నేహం చేయొద్దు అని కండిషన్లనీ పెట్టకూడదు. సోషల్ ఇంట్రాక్షన్ పరిచయమే కాదు. కావాలంటే ఎవరి దగ్గరి నుంచైనా చెడు అలవాట్లు నేర్చకుంటే అలాంటివారికి మాత్రం దూరంగా ఉంచొచ్చు. 

మన పిల్లలు సచిన్ లా క్రికెటర్ అవ్వాలి, మంచి సింగర్ అవ్వాలి అని కోరుకోవడంలో తప్పులేదు. అలాగని బలవంతం చేయొద్దు. నచ్చనది చేస్తే ఎప్పుడూ దానిలో సక్సెస్ కాలేరు. అదే వాళ్ల ఇష్టాలేంటో తెలుసుకుని వాటిలో ప్రోత్సహించండి. అవసరమైతే ట్రైనింగ్ ఇప్పించండి. ఎంత సక్సెస్ అవుతారో చూడండి.

పిల్లలు పొరపాట్లు చేస్తారు. అలాగని తిట్టడం కొట్టడం చేస్తే అక్కడే ఆగిపోతారు. పొరపాట్లు చేసినా, చదువు, ఆటల్లో వెనకబడ్డా మరొకసారి చేయమని ప్రోత్సహించండి. జీవితంలో అపజయాలు సాధారణమే అనుకుంటారు. మళ్లీ ప్రయత్నించడానికి వెనకాడరు.

ఏది వేసుకోవాలి, ఏం తినాలి అన్నీ మీరే నిర్ణయిస్తే వాళ్లెపుడు తెలుసుకుంటారు? అందుకే చిన్న చిన్న నిర్ణయాలను వాళ్లకే వదిలేయండి. డెసిషన్ మేకింగ్ అలవాటు అవుతుంది.

నల్లగా ఉంది, లావుగా ఉంది అని పిల్లల ముందు కామెంట్లు చేయొద్దు. వేరే వాళ్లను అనడంతో సరిపెట్టరు. వాళ్లలోని చిన్న లోపాలనీ పెద్దవి చేసి చూసుకుంటారు. అది వాళ్ల ఎమోషనల్ హెల్త్ పైనా ప్రభావం చూపుతుంది. ఎలాగున్నా అందమే అని చెప్పి చూడండి. వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఇంట్లో పరిస్థితులైనా, నిర్ణయాలైనా పిల్లల వరకూ ఎందుకు అని దాటవేయొద్దు. వాటినీ వారితో పంచుకోవాలి. వాళ్ల నిర్ణయాలకీ విలువనివ్వాలి. అప్పుడే ఇంట్లో, చుట్టూ ఏం జరుగుతోందో గమనించడం నేర్చుకుంటారు. పరిస్థితులకు తగ్గట్టుగా మసలుకోవడమూ తెలుస్తుంది.

click me!