Parenting Tips:స్కూల్ కి పిల్లల్ని ఎలా సిద్ధం చేయాలి?

Published : May 29, 2025, 06:33 PM IST
easy fast school tiffin box ideas from kerala

సారాంశం

ఉదయాన్నే ఆనందంగా ప్రారంభించండి. చిన్న విజయాలను అభినందించండి. ఈ పాజిటివ్ ఎనర్జీ పిల్లల్లో ఉత్సాహాన్ని పెంచుతుంది.

ఎండాకాలం అయిపోయింది. పిల్లల సెలవలు కూడా అయిపోవస్తున్నాయి. ఇన్ని రోజులు హ్యాపీగా ఆడుకున్న పిల్లలు... మళ్లీ స్కూల్ కి వెళ్లడానికి మారాం చేస్తారు. ఇన్ని రోజులు ఆలస్యంగా నిద్ర లేవడం అలవాటైన వాళ్లు.. మళ్లీ ఉదయాన్నే లేవడానికి ఇష్టపడరు. దీంతో.. పిల్లలను టైమ్ కి స్కూల్ కి పంపించడానికి పేరెంట్స్ తిప్పలు పడుతూ ఉంటారు. మరి, ఎలాంటి తిప్పలు లేకుండా.. పిల్లలను స్కూల్ కి టైమ్ కి పంపడానికి పేరెంట్స్ ఏం చేయాలో ఓసారి చూద్దాం...

అంతరాయాలను తగ్గించండి..

ఉదయపు సమయంలో టీవీ, టాబ్లెట్‌లు లేదా ఆటబొమ్మలను పరిమితం చేయండి. ఇవి పిల్లల దృష్టిని మరల్చి, సిద్ధమయ్యే వేళను ఆలస్యం చేయవచ్చు.

అత్యవసర ప్రణాళిక..

హోంవర్క్, లంచ్‌బాక్స్‌లు, వాటర్ బాటిళ్లు వంటివి ముందుగా సిద్ధంగా ఉంచండి. చెక్‌లిస్ట్‌లు లేదా రిమైండర్లు వాడటం ద్వారా చివరి నిమిషాల్లో ఆందోళనను తగ్గించవచ్చు.

పాజిటివ్ ఎనర్జీ నింపండి..

ఉదయాన్నే ఆనందంగా ప్రారంభించండి. చిన్న విజయాలను అభినందించండి. ఈ పాజిటివ్ ఎనర్జీ పిల్లల్లో ఉత్సాహాన్ని పెంచుతుంది.

హెల్దీ బ్రేక్ ఫాస్ట్..

పోషకవంతమైన, త్వరగా తినే అల్పాహారాలు (టోస్ట్, ఫలాల స్మూతీలు) ప్లాన్ చేయండి. కడుపు నిండుగా ఉండే ఆహారాన్ని ఇవ్వండి.

వారి పనులు వారే చేసుకునేలా ప్రోత్సహించాలి..

పళ్ళు తోముకోవడం, దుస్తులు ధరించడం వంటి పనులను పిల్లలు స్వయంగా నేర్చుకునేలా చేయండి. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచి, మీ సమయాన్ని కూడా ఆదా చేస్తుంది.

అలారం కంటే ముందే లేవడం..

అలారం కంటే ముందే లేవడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే ఎక్కువ సమయం కలిసొస్తుంది. ఏదైనా అత్యవసరం వచ్చినా మేనేజ్ చేయగలుగుతారు.

సమయపాలన..

ఉదయం లేచే సమయం, బ్రేక్ ఫాస్ట్ చేసే సమయం, రెడీ అవ్వడానికి పట్టే సమయం విషయాల్లో వారికి కొన్ని నిర్దిష్ట సమయాలను నిర్ణయించాలి. ఇలా ఒక రొటీన్ ఉంటే పిల్లలు ఈజీగా రెడీ అవ్వడం అలవాటు చేసుకుంటారు.నిద్రకు సరైన సమయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పిల్లలు ఉదయాన తేలికగా మేల్కొనగలుగుతారు.

ఇక పిల్లలు వేసుకోవాల్సిన బట్టలు, స్కూల్ బ్యాగ్, లంచ్ బాక్స్ వంటి వాటిని ముందే సిద్ధం చేయండి. ఇది ఉదయపు ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kids Health: పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు అరటిపండు, పెరుగు పెట్టొచ్చా? పెడితే ఏమవుతుంది?
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ సూపర్ ఫుడ్స్ పెడితే చాలు!