Parenting tips: పిల్లలకు మొబైల్ ఫోన్లు ఇస్తే ఏమౌతుంది?

Published : May 28, 2025, 11:53 AM IST
kids eating food

సారాంశం

మొబైల్ ఫోన్ వాడకం తప్పు అని పెద్దలకు తెలిసినప్పటికీ, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల ఏడుపు ఆపడానికి, ఫుడ్ తినిపించడానికి వాటిని ఇస్తున్నారు.

ప్రస్తుత కాలంలో పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. ఎంతలా అంటే ఇంట్లో ఉన్న మనుషులకంటే.. ఫోన్ లతోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ ఫోన్లు వచ్చాక అన్ని పనులు చాలా ఈజీగా అయిపోతున్నాయి. అంటే.. ఆన్ లైన్ షాపింగ్, బ్యాంకింగ్ ఇలా ప్రతిదీ ఇంటి నుంచే చేసేయగలుగుతున్నాం. దీని వల్ల మనకు తెలీకుండానే మనమంతా ఫోన్లకు బానిసలుగా మారిపోయాం. ఇంట్లో పెద్దవారిని చూసి పిల్లలు కూడా ఆ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. కనీసం బయటకు వెళ్లి ఆడుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు.

కరోనా ప్రభావం..

కరోనా మహమ్మారికి ముందు, చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మొబైల్ ఫోన్‌లు ఇవ్వడం మానేశారు. కానీ ఆన్‌లైన్ విద్య అవసరం కారణంగా, పిల్లలకు పేరెంట్సే ఫోన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కాస్త పిల్లలకు బాగా అలవాటై... బయటకు వెళ్లి ఆడుకోవాల్సిన ఆటలు కూడా ఫోన్ లోనే ఆడేస్తున్నారు. అసలు పిల్లలకు ఫోన్లు ఇవ్వడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం..

పిల్లలకు ఫోన్లు ఎందుకు ఇవ్వకూడదు?

అధిక మొబైల్ ఫోన్ వాడకం తప్పు అని పెద్దలకు తెలిసినప్పటికీ, కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల ఏడుపు ఆపడానికి, ఫుడ్ తినిపించడానికి వాటిని ఇస్తున్నారు. కానీ ఈ ఫోన్లు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. కానీ, పిల్లలకు ఫోన్లు ఇచ్చి ఆహారం తినిపించడం చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ల నుంచి వచ్చే నీలి కాంతి పిల్లల కళ్లను చాలా హానికరం.అంతేకాదు.. పిల్లల మెదడు పెద్దల కంటే రెండింతలు ఎక్కువ రేడియన్ ని గ్రహించగలవు. శారీరకంగానూ, మానసికంగానూ ఫోన్లు పిల్లలను దెబ్బతీస్తాయి.

శారీరక సమస్యలు..

దృష్టి తగ్గడం

నిద్రలేమి

మెదడు పనితీరులో అంతరాయం

జ్ఞాన క్షీణత

మాట ఆలస్యం

ఊబకాయం

ఎముక బలం తగ్గడం

మానసిక ఆరోగ్య సమస్యలు..

మానసిక గందరగోళం

ఆలోచనా సామర్థ్యం తగ్గడం

సామాజిక నైపుణ్యాల బలహీనత

భావోద్వేగ నియంత్రణ లేకపోవడం

పిల్లలు ఫోన్ చూడటం తగ్గాలంటే ఏం చేయాలి..?

సమయ నియంత్రణ:

పిల్లలు రోజుకు 1 లేదా 2 గంటలకు మించి తమ సెల్ ఫోన్‌లను ఉపయోగించడానికి అనుమతించకూడదు. ఆదివారం ఇంట్లో అందరూ కలిసి ఉన్నప్పుడు "మొబైల్ ఫ్రీ డే"ని ప్రవేశపెట్టండి.

ప్రత్యామ్నాయ విధులు:

పిల్లలను పార్కులకు తీసుకెళ్లండి, ఇంట్లో సాంప్రదాయ ఆటలు ఆడటానికి ప్రోత్సహించండి. కథల పుస్తకాలు చదివే అలవాటును కలిగించండి.

సాంప్రదాయ అభిరుచులు:

కళలు , చేతిపనులు, సంగీత వాయిద్యాలు నేర్చుకోవడం, తోటపని , పెంపుడు జంతువులను చూసుకోవడం వంటి అభిరుచులలో పిల్లలను పాల్గొనేలా చేయండి.

ఆ క్రమంలో, నేటి కాలంలో సెల్ ఫోన్లు తప్పనిసరి అయినప్పటికీ, పిల్లల మొబైల్ వాడకాన్ని కఠినంగా నియంత్రించాలి. తల్లిదండ్రులు మొదట ఆదర్శంగా ఉండాలి. వారి పిల్లలకు సరైన మార్గదర్శకత్వం అందించాలి. ఫోన్ ని మన అవసరాలకు మాత్రమే వాడాలని నేర్పించాలి. మీరు ఫోన్లు వాడకపోతే పిల్లలు కూడా వాటికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kids Health: పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు అరటిపండు, పెరుగు పెట్టొచ్చా? పెడితే ఏమవుతుంది?
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ సూపర్ ఫుడ్స్ పెడితే చాలు!