Parenting Tips: పిల్లల్లోనూ టెన్షన్స్, పేరెంట్స్ ఏం చేయాలి?

Published : May 27, 2025, 05:45 PM IST
how to make kids smart

సారాంశం

పెద్దవాళ్లకే టెన్షన్స్ ఉంటాయి.. పిల్లలకు ఏం టెన్షన్స్ ఉంటాయి అని అనుకుంటారు. కానీ, పిల్లల్లోనూ చాలా ఒత్తిడి ఎక్కువగా ఉంటుందట.

ప్రతి ఒక్కరికీ టెన్షన్స్ ఉంటాయి. ఉద్యోగం, ఇంటి పనితో పెద్దవాళ్లకు టెన్షన్స్ ఉండటం చాలా కామన్. కానీ.. స్కూల్ కి వెళ్లే పిల్లలకు కూడా టెన్షన్స్,  ఒత్తిడి ఉంటాయి అని మీకు తెలుసా? అసలు, పిల్లలకు ఏ విషయంలో టెన్షన్స్ ఉంటాయి.. వారిని టెన్షన్స్ నుంచి ఎలా బయటపడేయాలో తెలుసుకుందాం…

పిల్లల టెన్షన్ కి కొన్ని కారణాలు..

●  బాగా చదివినా పరీక్షలో ఫెయిల్ అవుతామేమో అని భయం
●  స్కూల్ నుంచి తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు రాకపోతే ఏంటి అనే ఆందోళన 
●  ఏ డ్రెస్ వేసుకోవాలా అని చాలా సేపు ఆలోచించడం 
●  ఎవరైనా ఏడిపిస్తారేమో అని భయం 
●  పడుకున్నా నిద్ర రాకపోవడం 
●  ఉదయాన్నే టెన్షన్ గా ఉండటం 
●  కలలు కని భయపడటం 
●  గతం గుర్తు చేసుకుని టెన్షన్ పడటం 
●  ఫ్రెండ్స్ తో గొడవ గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించడం 
●  తగ్గని కడుపు నొప్పి, తలనొప్పి 
●  పరీక్ష రోజు కడుపు నొప్పి, ఇతర ఇబ్బందులు 
●  ఏదైనా తప్పు జరుగుతుందేమో అని భయంతో స్కూల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనకపోవడం 
●  హోంవర్క్ చేసినా సరిగ్గా లేదనిపించి టీచర్ కి ఇవ్వకపోవడం 
●  బాగా చదువుకునే పిల్లలు ఉన్నట్టుండి చదువులో వెనకబడటం 
●  సంతోషంగా ఉండే పిల్లలు బాధపడుతున్నట్లు కనిపించడం 
●  యాక్టివ్ గా ఉండే పిల్లలు అన్నింట్లోనూ వెనకబడటం 

కారణాలు 

●  తల్లిదండ్రులకు టెన్షన్ ఉంటే 
●  ఇంట్లో గొడవలు, సమస్యలు 
●  చాలా ఒత్తిడితో కూడిన స్కూల్ లేదా ఇంటి వాతావరణం 
●  ఇతర పిల్లలు ఎప్పుడూ ఏడిపించడం, ఒంటరిగా ఉంచడం 
●  ఆత్మవిశ్వాసం లేకపోవడం 

పరిష్కారాలు 

●  పిల్లలపై ఒత్తిడి తగ్గించే మార్గాలు అన్వేషించాలి.
●  పిల్లల భయానికి కారణం అర్థం చేసుకోవాలి.
●  తల్లిదండ్రులు తోడున్నారనే నమ్మకం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
●  కొత్తగా ఆలోచించడం పిల్లలకు నేర్పించాలి. CBT అనే మానసిక చికిత్స దీనికి ఉపయోగపడుతుంది.
●  చిన్న వయసులోనే టెన్షన్ తగ్గిస్తే పిల్లలు సంతోషంగా ముందుకెళ్లగలరు, వారి ప్రతిభను బాగా ఉపయోగించుకోగలరు.
●  ఓటమి కూడా కొత్త విషయాలు నేర్చుకోవడంలో భాగమేనని వాళ్ళని అర్థం చేసుకోనివ్వాలి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kids Health: పిల్లలకు జలుబు, దగ్గు ఉన్నప్పుడు అరటిపండు, పెరుగు పెట్టొచ్చా? పెడితే ఏమవుతుంది?
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ సూపర్ ఫుడ్స్ పెడితే చాలు!