స్కూల్ టైం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? అయితే ఈ ఒక్క పని చేయండి

By Shivaleela Rajamoni  |  First Published Jul 18, 2024, 12:21 PM IST

పిల్లలు స్కూల్ టైం అయినా ఇంకా నిద్రపోతూనే ఉంటారు. కొద్ది సేపయ్యాక లేస్తాను.. ఇంకొంచెం సేపు పడుకుంటా.. అంటూ.. స్కూల్ టైం కి లేస్తారు. పిల్లల్ని నిద్రలేపడం, హడవుడిగా రెడీ చేయడం తల్లులకు పెద్ద తలనొప్పే. అందుకే పిల్లలు ఉదయం తొందరగా నిద్రలేవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
 


సండేలను పక్కన పెడితే.. సోమవారం నుంచి శనివారం వరకు.. ప్రతిరోజూ తల్లులకు పిల్లలతో పెద్ద తలనొప్పే వస్తుంది. ముఖ్యంగా వీళ్లను స్కూలుకు రెడీ చేయడం. అవును.. చాలా మంది పిల్లలు కరెక్టుగా స్కూలుకు వెళ్లడానికి ఇంకా అర్ధగంట మాత్రమే ఉందన్నప్పుడు నిద్రలేస్తారు. ఉదయం 6 గంటల నుంచి పేరెంట్స్ నిద్రలేపుతున్నా అస్సలు లేవరు. ప్రేమగా చెప్పినా.. అరిచినా, తిట్టినా పిల్లలు మాట విననే వినరు. ప్రతిరోజూ ఉదయాన్నే పిల్లలను లేపడం, వారిని స్కూల్ కు రెడీ చేసి బడికి పంపడం ప్రతి తల్లిదండ్రులకు చాలా పెద్ద సవాలే మరి. కొంతమంది పేరెంట్స్ అయితే స్కూల్ టైం అయినా నిద్రలేవడం లేదని కొడుతుంటారు. కానీ ఇది  మంచి పద్దతి కాదు. 

మీకు తెలుసా? మూడేళ్ల లోపు ఉన్న పిల్లలు సాధారణంగా 12 నుంచి 15 గంటలు నిద్రపోతారు.  5 నుంచి 10 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు 9 నుంచి 12 గంటల మధ్య నిద్రపోవాలి. అయితే మీ పిల్లలు వారి ఏజ్ కు తగ్గట్టు నిద్రపోకపోవడం వల్ల వారు ఉదయం తొందరగా నిద్రలేవరు. అందుకే వారిని సమయానికి పడుకోబెట్టాలి. అయితే పిల్లలు ఉదయం తొందరగా నిద్రలేవాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos

వారిని అర్థం చేసుకోండి: మీ పిల్లలు ఉదయాన్నే నిద్రలేవలేకపోతుంటే.. ఎందుకు లేవడం లేదో తెలుసుకోండి. అంతేకానీ అరవడమో, తిట్టడమో, కొట్టడమో చేయకండి. రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతేనే పిల్లలు ఉదయం నిద్రలేవడానికి ఇబ్బంది పడతారు. మీ పిల్లలకు రాత్రిపూట నిద్రపట్టడం లేదంటే వారిని హాస్పటల్ కు తీసుకెళ్లి చూపించండి.

టైం ను సెట్ చేయండి:  స్కూలుకు వెళ్లే పిల్లలు కనీసం 10 గంటలైనా నిద్రపోవాలి. కాబట్టి మీ పిల్లల్ని రాత్రిపూట ఫోన్లకు, టీవికి దూరంగా ఉంచండి. ముఖ్యంగా మీ పిల్లలు నిద్రపోవడానికి ఒక టైం ను సెట్ చేయండి. దీనివల్ల మీ పిల్లలు బాగా నిద్రపోతారు. ఉదయం తొందరగా నిద్రలేస్తారు. 

ప్రేమగా మాట్లాడండి: చాలా మంది పేరెంట్స్.. ఎంత నిద్రలేపినా లేవడం లేదని పిల్లలపై అరుస్తుంటారు. తిడుతుంటారు. కానీ పొద్దు పొద్దునే మీరు మీ పిల్లల్ని తిడితే వారి మూడ్ సరిగ్గా ఉండదు. పిల్లల్ని ప్రేమగా నిద్రలేపాలి. చెడు పదాలను ఉపయోగించకూడదు. ఉదయం పిల్లల్ని లేపేటప్పుడు వారి పేరును మధురంగా పిలవండి. 

పాటతో:  మీరు పిల్లల్ని లేపడానికి ఎన్నో టెక్నిక్స్ ను ఉపయోగించొచ్చు. వాటిలో ఒకటి వారికి  ఇష్టమైన పాటలను ప్లే చేయడం. ఇది మీ పిల్లల్ని ఉత్సాహంగా, ఎనర్జిటిక్ గా చేస్తుంది. అలాగే మీ పిల్లలు సంతోషంతో నిద్రలేస్తారు. 

మంచి వాసనొచ్చే భోజనం: మీ పిల్లలకు ఎంతో ఇష్టమైన ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ను తయారుచేయండి. ఈ బ్రేక్ ఫాస్ట్ నుంచి వచ్చే కమ్మని వాసనకు మీ పిల్లలు వాళ్లంతట వాళ్లే నిద్రలేస్తారు. అలాగే ఇలా చేస్తే మీ బిడ్డ త్వరగా రెడీ అయి ఆటోమేటిక్ గా బ్రేక్ ఫాస్ట్ ను తింటారు. 

బిజీగా ఉండండి: మీ పిల్లలు నిద్రలేచినప్పుడు వాళ్లను అస్సలు ఖాళీగా ఉంచకండి. లేదంటే వాళ్లు మళ్లీ నిద్రపోయే అవకాశం ఉంది. కాబట్టి మీ పిల్లల్ని నిద్రలేపిన తర్వాత వెంటనే మొక్కలకు నీరు పోయడం, నోట్ బుక్స్ ను స్కూల్ బ్యాగ్ లో పెట్టడం వంటి పనులను చెప్పండి. ఇలా చేస్తే మీ పిల్లలు స్కూలుకు తొందరగా వెళతారు. 

click me!