అంధురాలిపై రేప్: గొంతు విని నిందితుడ్ని గుర్తించిన బాధితురాలు

First Published May 7, 2018, 3:33 PM IST
Highlights

ఢిల్లీలోని ఆమె నివాసానికి సమీపంలోని ఓ గుడిసెలో 20 ఏళ్ల అంధురాలిపై ఈ నెల 20వ తేదీన అత్యాచారం జరిగింది.

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమె నివాసానికి సమీపంలోని ఓ గుడిసెలో 20 ఏళ్ల అంధురాలిపై ఈ నెల 20వ తేదీన అత్యాచారం జరిగింది. గొంతు విని నిందితుడిని బాధితురాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. తన తల్లి నీటికోసం బయటకు వెళ్లిన సమయంలో శుక్రవారంనాడు ఇద్దరు వ్యక్తులు తనపై లైంగిక దాడి చేయడానికి పథకం రచించారని బాధితురాలు గుర్తించింది.

ఆమెను బలవంతంగా ఇంటి నుంచి ఓ గుడిసెలోకి తీసుకుని వెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. మూడో వ్యక్తి కూడా వారిని కలిశాడని బాధితురాలు చెప్పింది. ఇద్దరు వెళ్లిపోయిన తర్వాత మూడో వ్యక్తి వచ్చి తనతో పాటు వస్తానని చెప్పాడని, అయితే, తాను వద్దని చెప్పానని ఆమె చెప్పింది.

తాను వద్దని చెప్పడంతో తనను బలవంతంగా గుడిసెలోకి తీసుకుని వెళ్లి తన నోరు మోసి తనపై అత్యాచారం చేశాడని ఆమె చెప్పింది.  ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు 45 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

వైద్య పరీక్షలు చేసిన తర్వాత కౌన్సెలింగ్ కోసం బాధితురాలిని ఎన్డీవో వద్దకు పంపించారు. దశాబ్దం క్రితం ఓ ప్రమాదంలో ఆమె కళ్లను పోగొట్టుకుంది. ఏప్రిల్ 15వ తేదీ వరకు ఢిల్లీలో రోజుకు ఐదుకు పైగా అత్యాచారాలు జరిగాయని పోలీసులు చెబుతున్నారు.

click me!