అలనాటి రాయలసీమ వీరుడు హంపన్నకు నివాళి

Published : Oct 04, 2017, 02:53 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
అలనాటి రాయలసీమ వీరుడు హంపన్నకు నివాళి

సారాంశం

బ్రిటిష్ సిపాయిల మానభంగ ప్రయత్నం నుంచి ఇద్దరు మహిళలను కాపాడబోయి ప్రాణాలు కోల్పొయిన వీరుడు హంపన్న

రాయలసీమ విమోచన సమితి ఆధ్వర్యంలో గూళపాళెం హంపన్న 125 వ వర్ధంతి ని గుత్తి లోని అయన సమాధి వద్ద  నిర్వహించి ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యకమ్రంలో విమోచన సమితి కన్వీనర్ రాజ శేఖర్ రెడ్డి, సర్కిల్ ఇన్స్ పెక్టర్  ప్రభాకర్ గౌడ్, ఇతర నాయకులు విజయభాస్కర్, హరిప్రసాద్, మహర్షి స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ  హంపన్నత్యాగనిరతిని కొనియాడారు.హంపన్నను రాయలసీమ యోధుడిగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. హంపన్ననాటి రాయలసీమ పౌరుషానికి ప్రతీక అన్ని అన్నారు.

ఇంతకు ఎవరీ హంపన్న

బ్రిటిష్ సిపాయిల కామ దాహానికి బలైపోతున్న మహిళల శీలాన్ని కాపాడెందుకు ఎదురునిలిచి సిపాయిల తుపాకి గుళ్లకు ప్రాణాలు వదిలి గూళపాళెం హంపన్న 1893లో ఇదే రోజున అమరుడయ్యారు. వీర హంపన్న ప్రాణత్యాగానికి ప్రతీకగా బ్రిటీష్ ప్రభుత్వం గుత్తి పట్టణం లొ సర్ థామస్ మన్రో సత్రం ఎదురుగా హంపన్న సమాధితో పాటు ఒక స్మారక స్తూపాన్ని నిర్మించింది. 1893వ సంవత్సరం అక్టోబర్ 4న బ్రిటీష్ సిపాయిల దండు ఒకటి బళ్లారి నుండి సికింద్రాబాదుకి వెళుతూ గుంతకల్లులో విడిది చేసింది. ఆ రోజుల్లో మిలిటరీ దండు విడిది చేసిందంటే మహిళలు ఇల్లు ఒదిలి బయటకు వెళ్ళేందుకు సాహసించేవారు కాదు. ప్రాణ భీతితో భయకంపితులయ్యేవారు. గుంతకల్లులో విడిది చేసిన సైన్యంలోని ఇద్దరు సిపాయిలు సాయంత్రం గ్రామ శివారులో షికారుకు వెళుతూ జొన్న చేనులో గడ్డి కోసుకుంటున్న ఇద్దరు మహిళలను చూశారు.

ఆ ఇద్దరిమీద లైంగికంగా దాడిచేసేందుకు ప్రయత్నించారు. సిపాయిలు తమ వైపు  రావడం గమనించిన మహిళలు భయంతో అక్కడి నుంచి పరుగు తీశారు. అయితే సిపాయిలు మాత్రం వారిని  వదలక వెంబడించారు. అదే సమయంలో అక్కడి  రైల్వే గేట్ కీపర్ గా ఉన్న గూళపాళెం హంపన్న ఆర్థనాదాలతో పరిగెడుతున్న మహిళలను చూశాడు. హంపన్న వెంటనే వారివద్దకు వెళ్లి తన గదిలోకి వెళ్లమని చెప్పాడు. అనంతరం హంపన్న సిపాయిలకు అడ్డుగా నిలిచాడు. అడ్డు తొలగమని సిపాయిలు హంపన్నకు అర్థం కాని భాషలో ఆదేశించారు.  ఆయన బెదరలేదు.

 

దీంతో ఆంగ్లేయ సిపాయిలు ఆగ్రహించి   హంపన్నను తుపాకితో కాల్చి నేలకూల్చారు. తుపాకి పేలుడు శబ్దం విన్న రైల్వే పోలీసులు అక్కడికి పరగులు తీశారు. దీంతో సిపాయిలు పారిపోయారు. తుపాకీ గుళ్లకు నేలకొరిగిన హంపన్నను ప్రాణాలతో బ్రతికించాలని వెంటనే గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి. హంపన్న ధైర్య సాహసానికి, మానవత్వానికి మహిళల మాన ప్రాణాలు కాపాడేందుకు ప్రాణాలు పోగొట్టుకున్న అమరవీరుడికి గుర్తుగా గుత్తిలోనే ఒక స్థూపం నిర్మించారు.

 

ఆ స్థూపం దిగువ భాగాన ‘‘ యూరోపియన్ సిపాయిల బారి నుంచి  ఇద్దరు మహిళలను రక్షించబోయి సిపాయిల తుపాకీ గుళ్లకు బలైన హంపన్న పార్థీవ దేహం ఇక్కడ పాతి ఉంది. ఇతను మరణించి యూరోపియన్, హిందూ దేశస్తుల మెప్పు పొందాడు’’ అని ఆంగ్ల భాషలో రాసి ఉంది. బ్రిటీష్ పాలకులు గుత్తి దుర్గాన్ని సందర్శించినప్పుడల్లా హంపన్న స్మారక స్థూపానికి, ఘనంగా రాజ లాంఛనాలతో నివాళులు అర్పించేవారు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu