తొలి ప్రసంగం ప్రధాని మోదీపై ఎక్కుపెట్టిన రాహుల్

First Published Dec 16, 2017, 12:38 PM IST
Highlights

అధ్యక్షడిగా రాహుల్ చేసిన తొలి ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్తల్లో ధీమా పెంచింది.

కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ  రాజ్ ఆరంభమైంది. వెంటనే ఆయన ప్రధాని మీద దాడి మొదలు పెట్టారు. తొలిప్రసంగంలోనే ఆయన తన  లక్ష్యమేమిటోకాంగ్రెస్ గమ్యం ఏమిటో స్పష్టం చేశారు. 

కొద్ది సేపటి కిందట చాలా అట్టహాసంగా జరిగిన రాహుల్ పట్టాభిషేకం పార్టీ నేతల్లో నూతనోత్సాహం నింపింది.  పెద్ద ఎత్తున వారు ఢిల్లి తరలివచ్చారు. న్యూఢిల్లీ 24, అక్బర్ రోడ్ లో పండగ వాతావరణం నెలొకింది. 

దీనికి కారణం, తల్లి లా కాకుండా, రాహుల్ సమాన్యుడిలా కార్యకర్తలలో కలసిపోవడం. ఆయన చాలా నిరాడంబరంగా ఉండటం అందరికి నచ్చింది. ఒక్కొక్క సారి పాత చిరిగిన బట్టలతోనే బయటకొస్తారు. దుస్తులు, మేకప్, అట్టహాసంగా కనిపించాలనే తత్వం ఆయన లో లేనే లేదు. ఈ విషయంలో ఆయన ప్రధాని మోదీకి పూర్తిగా వ్యతిరేకం. మోదీ అడంబరంగా కనిపిచేందుకు ఇష్టపడతారు.బహుశా గాంధీ వాదం నుంచి దేశాన్ని దూరం చేయాలనే ఆలోచన  దీనికి కారణం కావచ్చు.రాహుల్ తొలిప్రసంగంతోనే  పార్టీ కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకున్నారు. ప్రత్యర్థి పార్టీలను సైతం సంభ్రమానికి గురిచేసేలా సాగిన ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే... ‘భారతీయ జనతాపార్టీ దేశమంతా హింసాగ్ని రగిలిస్తున్నది.  కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు,’ అని తీవ్రంగా ప్రధానిని ఉద్దేశించి మాట్లాడారు.

‘‘దేశంలో సామరస్యాన్ని మోదీ సర్కారు నాశనం చేస్తున్నది. కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపిస్తే ప్రధానమంత్రి మోదీ దేశాన్ని మధ్యయుగాలనాటికి తీసుకుపోతున్నారు. సామరస్యం లేకపోయినా కొంపలేం మునగవన్నట్లు చేస్తున్నారు. నేటి రాజకీయాల కారణంగా మనలో చాలామంది భ్రమలో బతికేస్తున్నారు. రాజకీయాల్లో కనికరం, పారదర్శకత లోపించాయి. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో నూతన జవసత్వాలు నింపుతాం. పాత, కొత్త తరాలను కలుపుకుని ముందుకెళ్తాం. వచ్చేరోజుల్లో దేశ నలుమూలలా కాంగ్రెస్ పార్టీ గళం మార్మోగాలి. ఒంటరిగా పోరాడలేని వారికి నూతన బలాన్ని అందించి కలిసికట్టుగా పోరాడతాం. బీజేపీ ఎవరైనా నిలువరించగలవారు ఉంటే అది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలే. బీజేపీ రాజకీయ విధానాలు మాకు నచ్చకపోయినప్పటికీ మేము వారిని సోదరీ, సోదరుల్లానే భావిస్తాం. వాళ్లు మమ్ముల్ని తుడిచిపెట్టాలనుకుంటున్నారు... అయితే మేము వారిని కలుపుకుని పోవాలనుకుంటున్నాం. ప్రేమ, వాత్సల్యంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. గత 13 ఏళ్లుగా సోనియా, మన్మోహన్ సహా పార్టీ పెద్దల నుంచి అనే విషయాలు నేర్చుకున్నాను. అధ్యక్ష బాధ్యతలు గౌరవంగా స్వీకరిస్తున్నాను. పెద్దలు చూపిన బాటలోనే పనిచేస్తాను...’’ అని రాహుల్ పేర్కొన్నారు. జాతీయ గీతం ఆలాపనతో పార్టీ అధికారిక కార్యక్రమం ముగిసింది. అనంతరం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, టపాసులు పేలుస్తూ, మిఠాయిలు తినిపిస్తూ సంబరాలు కొనసాగించారు

click me!