స్టూవర్ట్ పురం కథ మారిపోయింది...

First Published Sep 8, 2017, 12:25 PM IST
Highlights
  •  స్టూవర్ట్ పురం అంటే పూర్వం దొంగలు, దోపిడీలు గుర్తుచ్చేది
  • ఇపుడు స్టూవర్ట్ పురం స్వర్ణయుగం మొదలయింది
  • దానికి కారణం రాగాల రాహుల్,రాగాల వరుణ్ 

 

స్టూవర్ట్ పురం అంటే గుర్తొచ్చేంది దారిదోపిడీగాళ్లు. ఎపుడో ఇలాంటి వాళ్లకు పునరావాసంకల్పించేందుకు బ్రిటిష్ వాళ్లు అక్కడక్కడ పీనల్ కాలనీలను పెట్టి వాళ్లతో దొంగతనం మానిపించే ప్రయత్నంచేశారు. అలాంటి కాలనీలో ఒకటి గుంటూరుజిల్లాలోని స్టూవర్ట్ పురం. నాటి బ్రిటిష్ హోం సెక్రెటరీ హెరాల్డ్ స్టువర్ట్ పేరు మీద ఈ కాలనీకి స్టువర్ట్ పురం అని పెట్టారు.  ఇంతవరకు ఈ వూరికి ఉన్న చరిత్ర ఇదే. స్టూవర్ట్ పురం దొంగల గురించి  వార్తలు మొన్నటి దాకా  చదువుతూనే ఉన్నారు. ఒకసారి గూగల్ లో సెర్చ్ చేస్తే ఎన్నిదొంగతనాల వార్తలొస్తాయో చూడండి.   స్టూవర్ట్ పురం గ్యాంగ్ అని సెర్చ్ చేస్తే వారి దొంగతనాలకు, దొంగతనం జరిగినపుడు దొంగలు  వాళ్లే నేమో అనే అనుమాలకు సంబంధించి 56,400 ఎంట్రీలొచ్చాయి. ఒక్క మంచి మాట రాలేదు.

అయితే, ఇపుడు స్టూవర్ట్ పురం సువర్ణాధ్యాయం మొదలవుతున్నది. స్టూవర్ట్ పురం రికార్డుకెక్కుతున్నది. భారత దేశానికి కీర్తి తెచ్చిపెట్టే బాధ్యత భుజానేసుకుంటున్నది. కారణం, ఈ వూరి కి చెందిన అన్న తమ్ముడు  2018లో ఆస్ట్రేలియాలో జరిగే కామన్వెల్తు క్రీడలలో పాల్గొనేందుకు అర్హత సంపాదించారు. రాగాల రాహుల్, రాగాల వరుణ్  వచ్చే ఏడాది వెయిట్ లిఫ్టింగ్ లో భారత తరఫున పాల్గొంటున్నారు. ఒకే వూరి నుంచి, ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ములు ఒకే అంతర్జాతీయ క్రీడలలో పాల్గొనడం రికార్డు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వీరిద్దరు హైదరాబాద్ స్పోర్ట్స్ స్కూల్ తో పాటు పటియాల(పంజాబ్) క్రీడల సంస్థలో శిక్షణ పొందారు. గురువారం జరిగిన కామన్ వెల్తు పోటీలలో 85కిలోల విభాగంలో రాగాల వెంకట రాహుల్ స్పాచ్156 కిలోలు, జర్క్ లో 195 కిలోల బరువులు ఎత్తి బంగారుపతకం సాధించారు. అతని సోదరుడు రాగాల  రాగాల వరుణ్ 77 కిలోల విభాగంలో స్నాచ్ 124 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ లో 145 కిలొలు బరువు  ఎత్తి బంగారు పథకం సాధించారు.  దీనితో సూవర్ట్ పురంలో సందడి నెలకొనింది. ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ వారి తండ్రి మధును సన్మానించారు.  తల్లి సంవత్సరానికి కూడా ఉండకుండా సోదరులిద్దరు పోటీలలో పాల్గొనేందుకు వెళ్లారని ఆయన భారంగా చెప్పారు. వరుణ్, రాహుల్ తండ్రి మధు  జాతీయ కబడ్డీ క్రీడాకారుడు. అయితే, ఈ అనుభవం ఆయనకేం అస్తి సంపాదించలేదు కాని, కొడుకులను జాతీయ స్థాయి క్రీడాకారులుగా మార్చాలనే ఆశయాన్నిచ్చింది.పేదరికాన్ని లెక్క చేయకుండా ఆయన వారికి శిక్షణ ఇప్పించాడు. దీనికోసం డబ్బులు అవసరమయి, వచ్చినకాడికి అంటే రు.25 లక్షల విలువయిన ఇంటిని 15లక్షలకేఅమ్మేయాల్సి వచ్చింది. తాను వ్యవసాయ కార్మికుడిగా, గుడిసేలో ఉంటూ కొడుకులు క్రీడాకారులుగా ఎదుగుతుండటం చూస్తు గర్విస్తూ ఉండేవాడు.

‘చిన్నప్పటినుంచే బరువులెత్తడం రాహుల్ కు నేర్పించాను.మావూరు వేదురుపల్లిలో మూడో తరగతి చదవగానే హైదరాబాద్ హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూలులో చేర్పించాను. అప్పటినుంచి రాహుల్ ఏదో ఒక మెడల్ తెస్తూనే ఉన్నాడు,‘ అని మధు చెప్పారు.

 

 

 

click me!