ముకేశ్ అంబానీ పరస్పర భిన్న వ్యూహాలతో భారత కార్పొరేట్ రంగంలో రారాజుగా అవతరించారు. 2009లో ఆర్ఎన్ఆర్ఎల్ సంస్థకు గ్యాస్ సరఫరాలో ధర ఖరారు విషయమై సోదరుల మధ్య చెలరేగిన వివాదం సుప్రీంకోర్టు దరి చేరింది. ముకేశ్ అంబానీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇదే ముకేశ్ అంబానీ వివిధ రంగాల్లో అడుగు పెట్టేందుకు బహుముఖ వ్యూహం అనుసరించారు.
ముంబై: టెలికం రంగాన్నే షేక్ చేసిన రిలయన్స్ జియో ఏర్పాటు కావడానికి పునాది 2010లోనే పడింది. రిలయన్స్ సంస్థ వ్యవస్థాపకుడు ధీరూబాయి అంబానీ 2006లో మరణించిన తర్వాత ఆయన కొడుకులు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ వాటాలు పంచుకున్నారు.
పెట్రో కెమికల్స్ బిజినెస్ ముకేశ్ అంబానీ చేతికి వస్తే, కమ్యూనికేషన్స్, ఫైనాన్స్, ఇన్ ఫ్రా, పవర్ వ్యాపారాలు అనిల్ అంబానీ సొంతమయ్యాయి. ఈ క్రమంలో అనిల్ అంబానీకి చెందిన ఆర్ఎన్ఆర్ఎల్ సంస్థకు గ్యాస్ సరఫరాలో ధర ఖరారు విషయమై సోదరుల మధ్య చెలరేగిన వివాదం సుప్రీంకోర్టు దరి చేరింది. ముకేశ్ అంబానీకి అనుకూలంగా తీర్పు వచ్చింది.
undefined
2010లో ఇన్ఫోటెల్ బ్రాడ్ బ్యాండ్ అనే చిన్న సంస్థ వైర్ లెస్ బ్రాడ్ బాండ్ వేలంలో సత్తా చాటింది. పలు సర్కిళ్లలో బ్రాడ్ బ్యాండ్ సొంతం చేసుకున్నది. ఇదే సమయంలో అంబానీ సోదరులు ఇద్దరూ గ్యాస్ ఆధారిత పవర్ రంగం మినహా అన్ని రంగాలపై ఉన్న కుటుంబ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు.
దీంతో టెలికం రంగంలోకి రిలయన్స్ అడుగు పెట్టేందుకు అవకాశం లభించింది. అనిల్ అంబానీ సారథ్యంలోని అడాగ్ సంస్థ పెట్రో రిఫైనరీ సంస్థలోకి అడుగు పెట్టే అవకాశం లభించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ వెంటనే ఇన్ఫోటెల్ సంస్థలో 95 శాతం వాటాలను కొనుగోలు చేయడం అప్పట్లో సంచలనం స్రుష్టించింది. ‘డేటా కొత్తతరం ఇంధనం’ అన్న విషయాన్ని ముకేశ్ అంబానీ అప్పట్లోనే గుర్తించినట్లు ఇన్ఫోటెల్ సంస్థలో వాటాల కొనుగోలు సంగతి రుజువు చేస్తోంది.
2013 బ్రాడ్ బ్యాండ్ స్పెక్ట్రం కంపెనీలు వాయిస్ సేవలు కూడా అందించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించడం రిలయన్స్ వరప్రసాదంగా మారింది. ఆ తర్వాత 2016లో ప్రారంభమైన జియో భారత డేటా సేవల రంగాన్ని మార్చివేసింది
తొలుత విస్తరించి తర్వాత ఆస్వాదించాలన్నట్లు రిలయన్స్ రిటైల్ ప్రస్థానం సాగింది. 2006లో కార్యకలాపాలను ప్రారంభించిన రిలయన్స్ రిటైల్ తొలిదశలోనే ద్రుష్టి సారించింది. 2013 వరకు ఈ సంస్థ లాభాలను సాధించలేదు. అయినా ఆయనపై ఇన్వెస్టర్లు నమ్మకాన్ని వదులుకోలేదు. లాభాల్లోకి వచ్చాక రాకెట్ స్పీడ్‌తో విస్తరణను చేపట్టింది.
తత్ఫలితంగా దేశంలోనే అతిపెద్ద రిటైల్ చైన్ నెట్‌వర్క్ రిలయన్స్ ఆవిర్భవించింది. 2015లో 2,621 స్టోర్లు 2019 మార్చి నాటికి 10,400 మార్కును దాటిపోయాయి. ఇక లాభాలు రూ.118 కోట్ల నుంచి రూ.5,500 కోట్లకు మించిపోయాయి.
రిలయన్స్ ట్రెండ్స్, ఫ్రెష్, ఫుట్ ప్రింట్, డిజిటల్, జ్యువెల్, సూపర్, మార్ట్, ఆటో జోన్, వెల్ నెస్ బ్రాండ్లతో రిలయన్స్ రిటైల్ విభాగం విస్తరించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తన అనుబంధ బిజినెస్‌ను అద్భుతంగా వినియోగించుకుంటున్నది. రిలయన్స్ సంస్థకు చెందిన ఉత్పత్తుల విక్రయానికి మంచి వేదిగా ఉపయోగ పడింది.
టెలికం రంగంలోకి జియో రంగ ప్రవేశం చేసిన కొత్తలో రిలయన్స్ డిజిటల్ ఊతకర్రలాగా పని చేసింది. ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లడం రిలయన్స్ వ్యాపార శైలిలోనే ఖచ్చితంగా కనిపిస్తుంది
భారత రిటైల్ రంగంలో పట్టు బిగించిన తర్వాత టెలికం రంగంలోకి అడుగు పెట్టింది. డేటా మార్కెట్‌లో తిరుగులేని ఆధిపత్యం సాధించింది. తాజాగా ఈ-కామర్స్ బిజినెస్‌లో అడుగుపెడుతోంది. దీంతోపాటు కస్టమర్లు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి ఆఫ్ లైన్‌లో కొనుగోలు చేసేలా వ్యాపార వ్యూహాన్ని అమలు చేసింది.
రిలయన్స్ రిటైల్‌తోపాటు స్థానిక విక్రేతలను కూడా భాగస్వాములను చేయనుండటంతో మార్కెట్లోకి బలంగా చొచ్చుకుపోయే అవకాశం లభించింది. ఈ క్రమంలోనే అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలతో తలపడేందుకు కూడా రిలయన్స్ సంసిద్ధమైంది. ఇక ప్రధాన వ్యాపారమైన రిఫైనింగ్, పెట్రో కెమికల్స్ సంస్థలకు అనుబంధంగా రిటైల్ పంపులను విస్తరించాలని నిర్ణయించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్.. బ్రిటిష్ పెట్రోలియం సంస్థతో జత కట్టింది.
డిజిటల్, మీడియా మార్కెట్‌లో బల పడటం కోసం భారీగా కంపెనీల కొనుగోళ్లకు తెర తీసింది. ఈ క్రమంలో నెట్ వర్క్ 18, కలర్స్, వై కామ్, మనీ కంట్రోల్ వంటి చానెళ్లను సొంతం చేసుకుంది. దీంతోపాటు బాలాజీ టెలి ఫిల్మ్ వంటి హిందీ దిగ్గజ నిర్మాణ సంస్థను కూడా ఒడిసి పట్టింది. హాత్ వే కేబుల్స్, డెన్ నెట్ వర్క్స్, డేటా కామ్ వంటి కేబుల్ సంస్థలు రిలయన్స్ గూటికి చేరాయి. ఇవి దేశంలోని మారుమూల ప్రాంతాలకు రిలయన్స్‌ను చేర్చాయి.
లయన్స్ ఆదాయంలో ప్రధాన భాగం ఇప్పటికీ పెట్రో కెమికల్, చమురు శుద్ధి వ్యాపారం నుంచే లభిస్తోంది. కానీ చమురు మార్కెట్లలో, వినియోగంలో పరిస్థితులు వేగంగా మారుతుండటంతో కంపెనీ ఆదాయ మార్గాలు దెబ్బతినకుండా వివిధ రకాల వ్యాపారాలపై కేంద్రీకరించింది రిలయన్స్. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో 32 శాతం స్థూల ఆదాయం కన్జూమర్ బిజినెస్ నుంచే లభించడం గమనార్హం.
ప్రపంచ వ్యాప్తంగా కాలుష్య నిర్మూలన కోసం వాహనాల్లో చమురు వినియోగాన్ని తగ్గించి విద్యుత్ వినియోగంపై ద్రుష్టి పెట్టారు. ఇది పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చే సరికి రిలయన్స్ సంస్థకు డేటా, రిటైల్ తదితర రంగాల నుంచి ప్రధాన ఆధాయం లభించడం ప్రారంభం అవుతుంది. ఇటీవల జూన్ త్రైమాసికంలో హైడ్రో కార్బన్ల వ్యాపారం కొంత ఒత్తిడికి గురైనా రిటైల్, ఇతర వ్యాపారాలు దాన్ని ఆదుకున్నాయి
రిలయన్స్ ప్రధానంగా హైడ్రో కార్బన్ల వ్యాపారాన్ని నిర్లక్ష్యం చేయలేదు. తన చమురు, గ్యాస్ శుద్ది కర్మాగారాల అప్ గ్రేడ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. రిలయన్స్ వద్దే ప్రపంచంలోకెల్లా అతిపెద్ద శుద్ది కర్మాగారాలు ఉన్నాయి. సౌదీ ఆరాం కో వంటి దిగ్గజానికి 20 శాతం వాటాలను విక్రయించి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇవ్వడంతో ఈ రంగంలో రిలయన్స్ తిరుగులేని శక్తిగా నిలిచింది.
రిలయన్స్ సంస్థలోకి ఆరాం కో నుంచి వచ్చే 15 బిలియన్ల డాలర్ల పెట్టుబడులతో రిలయన్స్ రుణ భారం కూడా తగ్గనుంది. మరో 18 నెలల్లో అప్పులేని కంపెనీగా ఎదిగే యత్నాలను ముమ్మరం చేసింది. వాటా మూల ధనంపైనే అధిక వ్యాపారం చేయాలని, అప్పులపై ఆధార పడకూడదనే రిలయన్స్ సిద్ధాంతానికి ఈ చర్య ఊతం ఇస్తుంది.
రిలయన్స్ సంస్థలోకి ఆరాం కో నుంచి వచ్చే 15 బిలియన్ల డాలర్ల పెట్టుబడులతో రిలయన్స్ రుణ భారం కూడా తగ్గనుంది. మరో 18 నెలల్లో అప్పులేని కంపెనీగా ఎదిగే యత్నాలను ముమ్మరం చేసింది. వాటా మూల ధనంపైనే అధిక వ్యాపారం చేయాలని, అప్పులపై ఆధార పడకూడదనే రిలయన్స్ సిద్ధాంతానికి ఈ చర్య ఊతం ఇస్తుంది.